Viral News: ధనం మూలం ఇదం జగత్.. 25 ఏళ్ల తర్వాత భర్త చెంతకు భార్య, పిల్లలు.. ఇక్కడే అసలు ట్విస్ట్

కొన్నేళ్ళ ఏళ్ల క్రితం తన భర్త దగ్గర డబ్బులు లేవని ఓ భార్య తన పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్లి పోయిన భార్య దాదాపు 20 ఏళ్ల తర్వాత భర్త దగ్గరకు పిల్లలను తీసుకుని వచ్చింది. దీంతో ఆ భర్త ఎంతో సంతోషపడ్డాడు. ఆ సంతోషం మాత్రం వారి ఉద్దేశ్యం తెలిసిన తర్వాత ఆవిరైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Viral News: ధనం మూలం ఇదం జగత్.. 25 ఏళ్ల తర్వాత భర్త చెంతకు భార్య, పిల్లలు.. ఇక్కడే అసలు ట్విస్ట్
Up Man Anil MishraImage Credit source: India Today
Follow us

|

Updated on: Aug 01, 2024 | 12:38 PM

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నా డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు, పైసా మే పరమాత్మ అని పెద్దలు సామెతగా చెప్పినా ఇందులో ఒకటే భావం. భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, స్నేహితులు అనే తేడా లేదు డబ్బు ఉంటే గౌరవిస్తారు. ప్రేమగా చూస్తారు. తప్పులను వెనకేసుకొచ్చి మరీ బంధాన్ని పెనవేసుకుంటారు. అయితే డబ్బులు లేని వ్యక్తులను తక్కువ భావంతో చూస్తారు. అంతేకాదు భార్య భర్తలు, తల్లి దండ్రులు పిల్లలు కూడా విడిపోయి ఒకరికొకరు కాకుండా విడివిడిగా జీవిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని సరమావు గ్రామానికి చెందిన అనిల్ మిశ్రా అనే 60 ఏళ్ల వ్యక్తి దాదాపు 20 సంవత్సరాల తర్వాత విడిపోయిన భార్య, పిల్లలు తన వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఉప్పొంగిపోయాడు. అయితే వారు ఎందుకు తన దగ్గరకు వచ్చారో తెలిసి షాక్ తిన్నాడు. అనిల్ మిశ్రాకు పెళ్లి అయిన కొత్తలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తేవి. దీంతో భార్య అనిల్ మిశ్రాని విడిచి పెట్టి తన పిల్లలతో పాటు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అసలు భర్తను కలిసే ప్రయత్నం చేయలేదు. తన భార్య, పిల్లల గురించి సమాచారం మిశ్రాకు ఏమీ తెలియలేదు. అలా 20 ఏళ్ళకు పైగా గడిచిపోయాయి.

అయితే ఇటీవల సరమావు గ్రామంలోని మిశ్రాకు చెందిన భూమిని బుందేల్‌ఖండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ) స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారంగా మిశ్రా ఖాతాలో రూ. 28 లక్షలు జమ చేసింది. ఈ విషయం ఎలా తెలిసిందో మరి అనిల్ మిశ్రా భార్య , పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. మిశ్రా భూమిని అమ్మిన సొమ్ముని తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అనిల్ మిశ్రా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో భార్య, పిల్లలు రూ. 1.5 లక్షలు లాక్కొని పారిపోయారని మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

సుమారు 20 ఏళ్ల క్రితం భార్య, పిల్లలతో కలిసి ఉంటూ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసేవాడిని అని అనిల్ మిశ్రా చెప్పాడు. తనకు 1.5 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో తన భార్య వివాహేతర సంబందం గురించి తనకు తెలిసి దానిని వ్యతిరేకించినట్లు చెప్పాడు. అదే సమయంలో కుటుంబం లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. దీంతో తరచుగా ఇంట్లో గొడవలు జరిగేవి. అప్పుడు అనిల్ మిశ్రా భార్య అనిల్ మిశ్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు అనిల్ జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అతను విడుదలైన తర్వాత.. అతడిని విడిచి పెట్టి పిల్లలను తీసుకుని తన ప్రేమికుడితో కలిసి జీవించడానికి వెళ్ళిపోయింది. జీవితంలో తనకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అనిల్ ఆధ్యాత్మిక బాట పట్టాడు. సమీప గ్రామంలోని ఆలయానికి పూజారిగా మారాడు.

ఇటీవల ఆయన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా రూ.28 లక్షల పరిహారం అందింది. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య , పిల్లలు అనిల్ ను ఆలయం దగ్గర కలిశారు. అతనిని తమతో తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అనిల్ కు తన గతం కళ్ళ ముందు కనిపించగా వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్ భార్య, పిల్లలు అనిల్ ఇటీవల బ్యాంకు నుండి విత్‌డ్రా చేసిన రూ.1.5 లక్షలను ఎత్తుకెళ్లారు. తన కుమారుల్లో ఒకరు లాయర్ ని మరికరు బాగా డబ్బున్న వ్యక్తీ అని.. ఎన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా తనని చూడడానికి రాలేదు అని అనిల్ మిశ్రా చెప్పారు. ఈ ఘటనపై ఝాన్సీ కి చెందిన పోలీసు సూపరింటెండెంట్ జ్ఞానదేవ్ కుమార్ స్పందిస్తూ అనిల్ మిశ్రా ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. దొరికిన ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..