AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెహ్రీలో మేఘం విస్ఫోటనం.. ఇద్దరు మృతి..కేదార్‌నాథ్ లో చిక్కుకున్న 200 మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతలోని జిల్లాలలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి టెహ్రీలోని భిలంగనా బ్లాక్‌లోని నౌతాడ్ టోక్‌లో క్లౌడ్‌బర్స్ట్ విధ్వంసం సృష్టించింది. అకస్మాత్తుగా పర్వతం మీద నుండి వచ్చిన నీటికి ఒక హోటల్ కొట్టుకుపోయింది. హోటల్ కొట్టుకుపోవడంతో దాని యజమాని భాను ప్రసాద్ (50), అతని భార్య నీలం దేవి (45), కుమారుడు విపిన్ (28) అదృశ్యమయ్యారు.

టెహ్రీలో మేఘం విస్ఫోటనం.. ఇద్దరు మృతి..కేదార్‌నాథ్ లో చిక్కుకున్న 200 మంది యాత్రికులు
Cloudburst In Tehri
Surya Kala
|

Updated on: Aug 01, 2024 | 8:58 AM

Share

ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెహ్రీలోని భిలంగానా బ్లాక్‌లోని నౌతాడ్ టోక్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా భారీ నష్టం జరిగింది. నౌటర్‌ టోక్‌లో ఓ హోటల్‌ కొట్టుకుపోవడంతో ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి బ్రిజేష్‌ భట్‌ తెలిపారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లిన దాదాపు 200 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. తెహ్రీలోని హోటల్ కొట్టుకుపోవడంతో దాని యజమాని భాను ప్రసాద్ (50), అతని భార్య నీలం దేవి (45), కుమారుడు విపిన్ (28) అదృశ్యమయ్యారు. భాను, అతని భార్య నీలం మృతదేహాలు సంఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలో బయటపడ్డాయి. అయితే ఇప్పటి వరకూ కొడుకు జాడ తెలియలేదు.

ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతలోని జిల్లాలలో వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి టెహ్రీలోని భిలంగనా బ్లాక్‌లోని నౌతాడ్ టోక్‌లో క్లౌడ్‌బర్స్ట్ విధ్వంసం సృష్టించింది. అకస్మాత్తుగా పర్వతం మీద నుండి వచ్చిన నీటికి ఒక హోటల్ కొట్టుకుపోయింది. అనేక జంతువులు కూడా అదే నీటిలో కొట్టుకుని వెళ్ళాయి. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో కస్టమర్స్ , ఇతర సిబ్బంది, ప్రయాణికులెవరూ లేరు. హోటల్ యజమాని భాను ప్రసాద్, అతని భార్య నీలం దేవి, కుమారుడు విపిన్ మాత్రమే ఉన్నారు. దీంతో ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలో భాను ప్రసాద్, అతని భార్య నీలం మృతదేహాలను రెస్క్యూ టీం స్వాధీనం చేసుకుంది. కొడుకు విపిన్ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వర్షం తర్వాత పెరిగిన పర్వత నదుల నీటి మట్టం

బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అనేక పర్వత నదుల నీటిమట్టం కూడా పెరిగింది. కేదార్‌నాథ్ ధామ్ లో భారీ వర్షాల కారణంగా, భింబాలిలోని MRP సమీపంలో 20 నుండి 25 మీటర్ల అడుగుల మార్గం దెబ్బతింది. దారిలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. 200 మంది ప్రయాణికులను భీంబాలి GMVN వద్ద సురక్షితంగా నిలిపివేశారు. మందాకిని నదిలో నీటిమట్టం పెరగడంతో ఆలయాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. అదే సమయంలో నది నీటి మట్టం పెరగడంతో సోన్‌ప్రయాగ్‌లో పార్కింగ్‌ను ఖాళీ చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

సీఎం ధామి డిజాస్టర్ సెక్రటరీ నుంచి సమాచారం తీసుకున్నారు

మేఘాల విస్పోటనం, భారీ వర్షం మధ్య జరుగుతున్న సంఘటనలతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాలను సీఎం ధామీ స్వయంగా పర్యవేక్షించారు. సెక్రటరీ డిజాస్టర్ నుండి అర్థరాత్రి సమాచారం తీసుకున్నారు. అదే సమయంలో ఉత్తరాఖండ్‌లోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పర్యాటకుల భద్రతే మా ప్రాధాన్యత. దయచేసి కొంత విరామం తర్వాత మాత్రమే మీ ప్రయాణాన్ని పునఃప్రారంభించండి.. జాగ్రత్తగా ఉండవలసిందిగా అభ్యందించారు. సురక్షిత ప్రదేశాలలో మాత్రమే ఉండండి.. స్థానిక అధికారుల సూచనలను అనుసరించని తెలిపారు. వాతావరణ సమాచారాన్ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండండి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండని పలు సూచనలు చేశారు అధికారులు

ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

అదే సమయంలో, ఉత్తరాఖండ్ ప్రాంతీయ వాతావరణ శాఖ రాబోయే 48 గంటలపాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత మంగళవారం రాత్రి నుంచి ఈ అలర్ట్‌ అమల్లో ఉంది. డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, చంపావత్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..