Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరదనీటిలో యువకుల పోకిరీ వేషాలు బైక్‌పై వెళ్తోన్న మహిళకు వేధింపులు.. సీసీ కెమెరాలో రికార్డ్

బైక్ మీద వెళ్తున్న జంటలోని మహిళపై ఆ యువకుల బృందం నీటిని జల్లుతూ నానా రచ్చ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన పట్టపగలు లక్నోలోని తాజ్ హోటల్ వంతెన కింద జరిగింది. నీళ్లతో నిండిన రోడ్డుపై వెళ్తోన్న బైక్‌ను చుట్టుముట్టిన కొందరు యువకులు దంపతులను అడ్డుకోవడం వీడియోలో కనిపిస్తుంది. యువకులు రైడర్‌లపై నీటిని చల్లడం ప్రారంభించారు. అయితే నీరు బాగా ఉండడంతో బైక్ స్పీడ్ ను డ్రైవ్ చేయలేకపోయాడు. కొందరు మహిళపై నీరు చల్లడం మొదలు పెట్టారు.

వరదనీటిలో యువకుల పోకిరీ వేషాలు బైక్‌పై వెళ్తోన్న మహిళకు వేధింపులు.. సీసీ కెమెరాలో రికార్డ్
Flooded Road In Lucknow
Surya Kala
|

Updated on: Aug 01, 2024 | 12:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వరదలతో నిండిన రోడ్డుపై మోటర్‌బైక్‌పై ఓ జంట ప్రయాణిస్తుంది. ఇలా బైక్ మీద ప్రయాణిస్తున్న మహిళపై కొంత మంది వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. వైరల్ వీడియోపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్ర రాజధాని లక్నో వీదులు వరద నీటితో నిండిపోయింది. ఆ నీటిలో కొంతమంది యువకులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో అటుగా బైక్ మీద ఒక జంట వస్తోంది. బైక్ మీద వెళ్తున్న జంటలోని మహిళపై ఆ యువకుల బృందం నీటిని జల్లుతూ నానా రచ్చ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన పట్టపగలు లక్నోలోని తాజ్ హోటల్ వంతెన కింద జరిగింది. నీళ్లతో నిండిన రోడ్డుపై వెళ్తోన్న బైక్‌ను చుట్టుముట్టిన కొందరు యువకులు దంపతులను అడ్డుకోవడం వీడియోలో కనిపిస్తుంది. యువకులు రైడర్‌లపై నీటిని చల్లడం ప్రారంభించారు. అయితే నీరు బాగా ఉండడంతో బైక్ స్పీడ్ ను డ్రైవ్ చేయలేకపోయాడు. కొందరు మహిళపై నీరు చల్లడం మొదలు పెట్టారు.

కొంతమంది వ్యక్తులు బైక్‌ను వెనుక నుండి లాగడానికి ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి వరద నీటి ప్రవహిస్తున్న రహదారిపై పడిపోయారు. బైక్‌ను బలవంతంగా లాగడానికి ముందు ఓ యువకుడు మహిళను పట్టుకున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ బైక్ నుండి పడిపోయిన మహిళకు ఒక యువకుడు సహాయం చేశాడు. ఆమె నీటి నుంచి లేచి నిలబడేలా సహాయం చేశాడు.

ఇలాంటి చర్యలు లక్నో సంస్కృతిలో భాగం కాదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. యోగి ప్రభుత్వంలోని పోలీసులు ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అని ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియోపై లక్నో పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. “గోమతి నగర్ పోలీస్ స్టేషన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టినట్లు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గందరగోళం సృష్టించచిన యువకులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..