AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Bomb Threat: రైలులో సీటు కోసం లొల్లి.. కోపంతో రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..

ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో సీటు కోసం కొంటామని ప్రయాణీకుల మధ్య వివాదం చెలరేగింది. దీని తర్వాత ఇద్దరు సోదరులు రైలులో బాంబు ఉందని రైల్వేకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే తీవ్ర భయాందోళనకు గురైంది. మూడుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత.. రైలును పంపించారు

Fake Bomb Threat: రైలులో సీటు కోసం లొల్లి.. కోపంతో రైలులో బాంబ్ ఉందంటూ ఫిర్యాదు..
Fake Bomb Threat In Kanpur,
Surya Kala
|

Updated on: Oct 18, 2025 | 11:27 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సీటు కోసం జరిగిన గొడవ రైల్వేలో సంచలనం సృష్టించింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు సోదరులు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి..తమతో కోట్లాడిన వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే కోరికతో రైలులో బాంబు పెట్టినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. బాంబు అన్న మాటతో రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. బాంబ్ హెచ్చరిక రైల్వే సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తం రైలును దాదాపు 45 నిమిషాల పాటు తనిఖీ చేశారు. ప్రతిదీ సాధారణంగా కనిపించింది. తర్వాత ఫోన్ చేసిన ఇద్దరు సోదరులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

కాన్పూర్‌లోని ఘటంపూర్‌కు చెందిన ఇద్దరు సోదరులు 15708 ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్ (అమృత్‌సర్-కతిహార్)లో ప్రయాణిస్తున్నారు. కంపార్ట్‌మెంట్‌లోని సీటు విషయంలో ఇద్దరు అన్నదమ్ములతో కొంతమంది వాగ్వాదానికి దిగారు. దీనితో దీపక్ చౌహాన్ అనే వ్యక్తికి కోపం వచ్చి రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి రైలులో బాంబు అమర్చినట్లు సమాచారం ఇచ్చాడు. కంపార్ట్‌మెంట్ కిటికీ దగ్గర నల్లటి దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు రైలులో టైమ్ బాంబును అమర్చారని.. అది ఎప్పుడైనా పేలిపోవచ్చని చౌహాన్ చెప్పారు.

మూడుసార్లు తనిఖీ

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ విషయం గురించి తెలియగానే రైల్వే సిబ్బంది ఒక్కసారిగా కుదుపుకు గురైంది. GRP, RPF, ACP, LIU రైలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అర్ధరాత్రి వరకు రైలును మూడుసార్లు తనిఖీ చేశారు. ఏమీ కనిపించకపోవడంతో..రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైలు తన గమ్య స్థానికి బయలుదేరింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డియోరియాతో పాటు సిద్ధార్థనగర్‌కు చెందిన ముగ్గురు ప్రయాణికులను కూడా విడుదల చేశారు.

ఇద్దరు నిందితులు అరెస్టు ఈ ఫిర్యాదు తర్వాత.. బాంబు బెదిరింపును వ్యాప్తి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అతని మొబైల్ నంబర్‌ను గుర్తించారు. కాన్పూర్‌లో రైలు దిగిన తర్వాత.. పోలీసులు నిఘా సంస్థ అతని గుర్తించి.. ఫెయిత్‌ఫుల్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించినప్పుడు.. కంపార్ట్‌మెంట్‌లో సీటు విషయంలో జరిగిన గొడవను, ఆ వివాదంలో వారిని ఇరికించడానికి జరిగిన కుట్రను వారు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా