Fire Accident: మాయదారి పిల్లి.. బిలియనీర్ కుటుంబాన్ని బూడిద చేసింది..!
శ్యామదాసాని కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. సంజయ్ తన భార్య, కొడుకు, పనిమనిషితో కలిసి పై అంతస్తులో ఉన్నారు.
దీపావళి రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని శ్యామదాసాని కుటుంబానికి చీకటి రాత్రిగా మారింది. అతని విలాసవంతమైన బంగ్లా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ శ్యామదాసాని, అతని భార్య కనిక, పనిమనిషి ఛవి పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారు.
శ్యామదాసాని కుటుంబం దాదాపు 50 ఏళ్ల క్రితం కాన్పూర్ వచ్చింది. కుటుంబ పెద్ద చిన్న కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పంక్చర్ షాప్ తెరవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలాగోలా చిన్నపాటి అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నేడు ఈ కుటుంబం పార్లే-జి బిస్కెట్ ఫ్రాంచైజీతో పాటు ఇతర వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బిలియనీర్‌లలో ఒకరిగా ఉన్నారు.
శ్యామదాసాని కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. సంజయ్ తన భార్య, కొడుకు, పనిమనిషితో కలిసి పై అంతస్తులో ఉన్నారు. దీపావళి రోజున కొడుకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సంజయ్ భార్యతో కలిసి నిద్రపోయాడు. రాత్రి, దీపావళి దీపం నుండి మంటలు చెలరేగాయి. అది నేల మొత్తం వ్యాపించింది. దీపావళికి కొన్ని రోజుల ముందు సంజయ్ ఇంట్లో కలపతో ఫాల్స్ సీలింగ్ చేయించాడు. దీంతో పాటు తలుపులు, కిటికీలను సౌండ్ ప్రూఫ్ చేసి ఎలక్ట్రానిక్‌గా మార్చారు. అయితే ఇంట్లో దీపం కారణంగా అంటుకున్న మంటలు, ఇల్లంతా వ్యాపించి తలుపులు, కిటికీలు జామ్ అయ్యాయి. కుటుంబ సభ్యులంతా ఊపిరి ఆడక చనిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు. కలప, ఫాల్స్ సీలింగ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
మంటలకు పిల్లి కారణమా?
ప్రమాదం జరిగిన తర్వాత ఇంట్లో ఎలా మంటలు చెలరేగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ కుటుంబానికి ఒక పిల్లి ఉంది. అది ప్రమాదంలో మరణించింది. బహుశా పిల్లి దూకడం వల్ల ఇంట్లోని దేవుడి వద్ద ఉంచిన దీపం పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎలక్ర్టానిక్ తలుపులు, కిటికీలకు నిప్పంటుకుని, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇల్లంతా వ్యాపించాయి. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లికి కూడా పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.
ఇంట్లో గాలికి వెంటిలేషన్ తప్పనిసరిగా ఉండాలని అగ్నిమాపక నిపుణులు సూచిస్తున్నారు. ఆధునికత ముసుగులో, ప్రజలు తమ ఇళ్లను పూర్తి ఏసీతో ప్యాక్ చేస్తున్నారు. దీని కారణంగా వారి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇలాంటి ప్రమాదాల సమయంలో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. శ్యామదాసాని కుటుంబీకుల ఇంట్లో వెంటిలేషన్ ఉండి, తలుపులు ఎలక్ర్టానిక్‌గా లేకుంటే, బహుశా ఆ కుటుంబం ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..