పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు తెలిసిపోతుంది.. అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది.. సరికొత్త టెక్నాలజీ..
UP Police Monitor On Porn Watching Users: రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పోర్న్ వీడియోలు (అశ్లీల చిత్రాలు) చూస్తే..
UP Police Monitor On Porn Watching Users: రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పోర్న్ వీడియోలు (అశ్లీల చిత్రాలు) చూస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సంకేతాలు వచ్చేలా సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మొబైల్‌లో పోర్న్ వీడియోలను చూసే వారికి ట్రాక్ చేయడానికి యూపీ పోలీసులు ఊముప్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల ఎవరైనా మొబైల్ ఫోన్లలో అశ్లీల వీడియోలను చూస్తే వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుంది. మొబైల్‌లోని బ్రౌజర్ హిస్టరీ ఆధారంగా.. పోర్న్ వీడియో చూసిన వారి లొకేషన్, డేటాను యూపీ ఉమెన్ పవర్‌లైన్ 1090 సంకేతాలు పంపేలా వ్యవస్థను రూపొందించారు. ఎవరైతే పోర్న్ చూస్తారో.. వారి డేటా నేరుగా ఊముప్ కంపెనీకి వెళుతుంది. వెంటనే వీడియోలు చూస్తున్న వారికి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇక ఈ సమాచారం పోలీసులకు కూడా ఒకేసమయంలో చేరుతుంది. మరి యూపీ పోలీసులు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మహిళలపై జరుగుతోన్న దాడులను ఏమేర తగ్గిస్తుందో చూడాలి. ఈ విషయమై యూపీకి చెందిన ఏడీజీ నీరా రావత్ మాట్లాడుతూ.. ‘ఈ కొత్త విధానాన్ని మొదట పైలట్ ప్రాజెక్టుగా ఆరు జిల్లాల్లో ప్రారంభించాము. విజయవంతం కావడంతో ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము. మహిళలపై జరుగుతోన్న దాడులకు పోర్న్ వీడియోలు కూడా ఒక కారణం’ అని రావన్ అభిప్రాయపడ్డారు.
Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతల ఆందోళన ‘ప్రభుత్వ మితిమీరిన విశ్వాసం’, ఇండియాలో ఎంటరయిన మరో 2 కోవిడ్ స్ట్రెయిన్స్ పై రాహుల్ ఫైర్