Prahlad Joshi: కుటుంబంతో కలిసి ‘ది కేరళ స్టోరీ’ని చూసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఆ తర్వాత ఏమన్నారంటే..

కర్ణాటకలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. కాగా.. కర్ణాటక ఎన్నికల ప్రచారం సోమవారం (మే 8)తో ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు గత కొద్ది రోజులుగా హోరాహోరీ ప్రచారంతో రాజకీయాలను హీటెక్కించారు.

Prahlad Joshi: కుటుంబంతో కలిసి ‘ది కేరళ స్టోరీ’ని చూసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఆ తర్వాత ఏమన్నారంటే..
Prahlad Joshi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2023 | 7:18 PM

కర్ణాటకలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. కాగా.. కర్ణాటక ఎన్నికల ప్రచారం సోమవారం (మే 8)తో ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు గత కొద్ది రోజులుగా హోరాహోరీ ప్రచారంతో రాజకీయాలను హీటెక్కించారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా కర్ణాటక సహా.. దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రం కొన్ని తప్పుడు వాదనలు చేసిందని, ఈ చిత్రం దేశంలోని మత సామరస్యాన్ని నాశనం చేసేలా ఉందని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ చిత్రాన్ని అందరూ చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు అభ్యర్థించారు. గెరువా క్యాంప్ ప్రకారం.. ఈ చిత్రం ఉగ్రవాదం కొత్త ముఖాన్ని బట్టబయలు చేసింది. దీంతో కర్ణాటక ప్రచార దశలో ఈ సినిమాపై రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రచారం ముగిశాక కాస్త ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపారు. కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి ‘ది కేరళ స్టోరీ’ సినిమాను హుబ్లీలోని ఓ సినిమా హాలులో వీక్షించారు.

Union Minister Prahlad Joshi

Union Minister Prahlad Joshi

‘ది కేరళ స్టోరీ’ చూసిన తర్వాత, ప్రహ్లాద్ జోషి ట్విట్టర్‌లో చిత్ర నిర్మాతలను అభినందించారు. “సినిమా ది కేరళ స్టోరీ చాలా సందర్భోచితమైన సమస్యను లేవనెత్తింది. భారత వ్యతిరేక శక్తులు మన దేశ సామాజిక నిర్మాణాన్ని ఏ విధంగానైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. చిత్ర బృందం మొత్తం అద్భుతమైన, ధైర్యమైన ప్రయత్నం చేసింది. ఈ కథను అందించిన దర్శక, నిర్మాతలను అభినందిస్తున్నాను” అంటూ ప్రహ్లాద్ జోషి ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాపై దేశంలో పలు ప్రాంతాల్లో రాజకీయ దుమారం మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి తమిళనాడులో అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయనప్పటికీ, హాలు యజమానులు సినిమాను ప్రదర్శిస్తే విధ్వంసం జరుగుతుందని భయపడి ప్రదర్శనను నిలిపివేశారు. మరోవైపు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఈ సినిమా ప్రదర్శనపై పన్ను మినహాయింపు ప్రకటించారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ చిత్రం మే 5న విడుదలైంది. కేరళ స్టోరీ చిత్రం కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథను వివరించింది. సిరియాలోని ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్ గ్రూప్‌లో వారు మతం మార్చబడి ఏ విధంగా సెక్స్ బానిసలుగా మారారు.. ISIS కింద మహిళలపై జరుగుతున్న హింసను దీనిలో చూపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..