Nitin Gadkari: ప్రతి లారీ క్యాబిన్‌ల్‌లో ఏసీ తప్పనిసరి.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. N2, N3 కేటగిరీలకు చెందిన ట్రక్కుల క్యాబిన్‌లలో ఏసీలను తప్పనిసరి చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈమేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా,

రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. N2, N3 కేటగిరీలకు చెందిన ట్రక్కుల క్యాబిన్‌లలో ఏసీలను తప్పనిసరి చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈమేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం నాడు వెల్లడించారు. త్వరలోనే ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి అవుతుందని తెలిపారు. రోడ్డు భద్రతలో లారీడ్రైవర్లది కీలక పాత్ర కనుక వారికి సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డ్రైవర్లకు ఏసీ ద్వారా అలసట సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు నితిన్ గడ్కరీ.
కాగా, రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఓవైపు రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూనే.. మరోవైపు భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తోంది. వాహనాల్లో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాంటూ వాహన తయారీ కంపెనీలను ఆదేశిస్తోంది. కార్లలో 6 సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు సహా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు లారీల్లో ఏసీ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..