Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రాణం పోయినా రివేంజ్ తీసుకున్న మేక.. తనను బలిచ్చిన వ్యక్తిని తిరిగి బలి తీసుకుంది! అసలేం జరిగిందంటే..

జంతుబలుల గురించి మనం వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం.. జంతు బలులు నిషేధం అంటూనే, వాటిని కొనసాగిస్తోంది సమాజం. తాజాగా ఓ మేక బలికి సంబంధించి వార్త ఒకటి సంచలనంగా మారింది. దేవతకు మేకను బలిచ్చిన వ్యక్తి.. చివరకు ఆ మేక మాంసాన్ని తినే బలయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు

Viral: ప్రాణం పోయినా రివేంజ్ తీసుకున్న మేక.. తనను బలిచ్చిన వ్యక్తిని తిరిగి బలి తీసుకుంది! అసలేం జరిగిందంటే..
Goat
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 07, 2023 | 5:57 AM

జంతుబలుల గురించి మనం వింటూనే ఉన్నాం.. చూస్తూనే ఉన్నాం.. జంతు బలులు నిషేధం అంటూనే, వాటిని కొనసాగిస్తోంది సమాజం. తాజాగా ఓ మేక బలికి సంబంధించి వార్త ఒకటి సంచలనంగా మారింది. దేవతకు మేకను బలిచ్చిన వ్యక్తి.. చివరకు ఆ మేక మాంసాన్ని తినే బలయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూరజ్ పూర్ జిల్లాకు చెందిన బగర్ సాయి.. గతంలో దేవతకు మొక్కులు మొక్కుకున్నాడు. తన కోరికలు నెరవేరితే మేకను బలిస్తానంటూ వాగ్దానం చేశాడు. చివరకు తన కోరికలు నెరవేరడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పిలిచి దేవత గుడిలో ఓ మేకను బలిచ్చాడు. ఆ మేకను వంట వండుకుని ఇంట్లో సంబరాలు చేసుకున్నారు.

అయితే, మేకను బలిచ్చిన బగర్ సాయి.. ఆ మేక తలను తీసుకెళ్లి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ క్రమంలో మద్యం ఎక్కువ అవగా.. స్నేహితులతో సవాళ్లు చేయడం మొదలుపెట్టాడు. తాను పచ్చి మాంసాన్నే తింటానంటూ గప్పాలు చెప్పాడు. స్నేహితులు వద్దురా బాబూ అన్నా వినకుండా.. తన వెంట తీసుకువచ్చిన మేక కన్నును బయటకు తీసి తినే ప్రయత్నం చేశాడు. అయితే, అది కాస్తా జారి గొంతులో ఇరుక్కుపోయింది. నీళ్లు తాగమని స్నేహితులు సూచించినా వినకుండా అలాగే ఉన్నాడు. చివరకు గొంతులో ఇరుక్కున్న ఆ కన్నుగుడ్డు వల్ల ఊపిరి ఆడకుండా అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనతో అప్పటి వరకు పండగ వాతావరణం ఉన్న అతని ఇంట్లో విషాధచాయలు అలముకున్నాయి. పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న స్నేహితుడిని చూసి మిగతా మిత్రులు బోరున విలపిస్తున్నారు. మరికొందరైతే.. జంతు బలిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. మేకను అతను బలిస్తే.. చనిపోయిన మేక అతన్ని బలి తీసుకుందని అంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా షాక్‌కు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..