Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: భోజనం చేశాక ఎంతసేపటి తరువాత వాకింగ్ చేయాలి? తప్పక తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యం..

భోజనం చేసిన తరువాత కాసేపు నడవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, ఇలా నడవటం వలన జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అందుకే చాలా మంది ప్రజలు భోజనం చేసిన తరువాత కాసేపు నడుస్తుంటారు.

Health Tips: భోజనం చేశాక ఎంతసేపటి తరువాత వాకింగ్ చేయాలి? తప్పక తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యం..
Walking
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2023 | 3:19 PM

భోజనం చేసిన తరువాత కాసేపు నడవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, ఇలా నడవటం వలన జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అందుకే చాలా మంది ప్రజలు భోజనం చేసిన తరువాత కాసేపు నడుస్తుంటారు. అయితే, భోజనం చేసిన తరువాత వెంటనే నడవాలా? లేక కాసేపటి తరువాత నడవాలా? అనేది చాలా మందిలో ఉండే కన్‌ఫ్యూజన్. అయితే, చాలా మంది భోజనం చేసిన 30 నిమిషాల తరువాత వాకింగ్ చేయాలని సూచిస్తారు. మరికొందరు భోజనం చేసిన వెంటనే నడువొచ్చని చెబుతుంటారు. మరి రాత్రి భోజనం  తర్వాత ఎప్పుడు నడవాలి? ఏ సమయంలో నడిస్తే మేలు జరుగుతుంది? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. భోజనం తర్వాత నడవడానికి సరైన సమయం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. వ్యక్తి ఆరోగ్యం, శరీరం సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ విషయంలో మీకు ఏది ఉత్తమమో.. మీకు ఏది సహాయపడుతుందో కొన్ని మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి..

శరీర అవసరం: భోజనం తర్వాత ఎలా అనిపిస్తుందో గ్రహించాలి. అసౌకర్యం, ఉబ్బరం అనిపిస్తే.. భోజనం చేసిన 30 నిమిషాల తరువాత వాకింగ్ చేయడం ఉత్తమం. అలా కాకుండా అంతా బాగున్నట్లు అనిపిస్తే భోజనం చేసిన వెంటనే నడవడం మంచిది.

తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలి: బ్రిస్క్ వాక్, మరింత శారీక శ్రమతో కూడిన వ్యాయామాన్ని ఇష్టపడితే, భోజనం తర్వాత 10-15 నిమిషాలు వేచి ఉండటం ఉత్తమం. ఇది అసౌకర్యం కలుగకుండా నివారిస్తుంది. అయితే, సాధారణ వాకింగ్ చేయాలనుకుంటే.. భోజనం చేసిన వెంటనే నడిచినా ఎలాంటి సమస్యా ఉండదు.

వ్యక్తిగత ప్రాధాన్యత: రాత్రి భోజనం తర్వాత ఎప్పుడు నడవాలనే నిర్ణయం మీ వ్యక్తిగత ప్రాధాన్యత, మీ శరీరానికి ఏది సౌకర్యవంతంగా ఉంటుందో దానిపై ఆధారపడి ఉండాలి. కొంతమంది భోజనం చేశాక కాసేపు వేచి ఉండి, ఆ తరువాత వాకింగ్ చేస్తే మేలు జరుగుతుంది. మరికొందరు భోజనం చేసిన వెంటనే నడకను మొదలుపెట్టవచ్చు.

భోజనం తర్వాత నడవడం వలన శారీరక కదలికలను ఉత్తేజపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఏవైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉంటే నేరుగా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..