AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కళ్ల ముందే ఉన్నా పట్టించుకోం.. ఈ చెట్టు ఔషధాల గని.. బెరడుతోనే 6 వ్యాధులు నయం చేయొచ్చు..!

మనం చుట్టూ బోలెడు చెట్లు ఉంటాయి. అయితే, వాటిని పిచ్చి చెట్లు అనుకుని లైట్ తీసుకుంటాం. కానీ, వాటి వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయని తెలిసిన వారు చెబితే అవాక్కవుతాం. అలాంటి మొక్కలలో అర్జున చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. పూర్వపు ప్రజలు మెడిసిన్స్‌కి బదులుగా ఈ ఔషధ మొక్కలను వ్యాధుల నివారణకు ఉపయోగించేవారు.

Health Tips: కళ్ల ముందే ఉన్నా పట్టించుకోం.. ఈ చెట్టు ఔషధాల గని.. బెరడుతోనే 6 వ్యాధులు నయం చేయొచ్చు..!
Arjuna Bark
Shiva Prajapati
|

Updated on: Jul 06, 2023 | 6:58 AM

Share

మనం చుట్టూ బోలెడు చెట్లు ఉంటాయి. అయితే, వాటిని పిచ్చి చెట్లు అనుకుని లైట్ తీసుకుంటాం. కానీ, వాటి వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయని తెలిసిన వారు చెబితే అవాక్కవుతాం. అలాంటి మొక్కలలో అర్జున చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. పూర్వపు ప్రజలు మెడిసిన్స్‌కి బదులుగా ఈ ఔషధ మొక్కలను వ్యాధుల నివారణకు ఉపయోగించేవారు. కానీ, ప్రస్తుతం అంతా రసాయనాలతో తయారు చేసిన మెడిసిన్స్ ఉపయోగించడం కారణంగా.. వాటి వినియోగం తగ్గింది. దాంతో ప్రాముఖ్యత కూడా తగ్గింది. అర్జున చెట్టు బెరడులో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. అనేక వ్యాధులను నయం చేయడానికి అర్జున బెరడును శతాబ్ధాల నుంచి వినియోగిస్తున్నారు. ఇది ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు చిటికెలో నయం చేస్తుంది. అర్జున బెరడుతో 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. మధుమేహం: అర్జున్ బెరడు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లు, యాంటీడయాబెటిక్ లక్షణాలు, మూత్రపిండాలు, కాలేయాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు అర్జున్ బెరడుతో నీటిని మరిగించి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు.

2. గుండె జబ్బు: అర్జున్ బెరడు గుండెకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో, దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఎలుకలపై ఎన్‌సిబిఐ చేసిన పరిశోధనలో అర్జున బెరడులో ట్రైటర్‌పెనాయిడ్ అనే ప్రత్యేక రసాయనం ఉందని, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించారు.

3. జలుబు, దగ్గు: వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అర్జున బెరడు సహాయపడుతుంది. జలుబు, దగ్గును త్వరగా నయం చేస్తుంది. ఈ బెరడు ముక్కు కారడాన్ని తగ్గిస్తుంది. ఊరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తుంది.

4. శ్వాసకోశ సమస్యలు: ఆయుర్వేదం ప్రకారం.. అర్జున బెరడు శ్వాసకోశ వ్యాధుల నివారణకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

5. అధిక రక్తపోటు: అర్జున్ బెరడులో ట్రైటెర్పెనాయిడ్ రసాయనాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది యాంటీహైపెర్టెన్సివ్ లక్షణాలను కూడా కలిగి ఉంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

6. జీర్ణక్రియ: జీర్ణశక్తి మెరుగుపడాలంటే అర్జునుడి బెరడు మరిగించిన నీరు తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇది మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆయుర్వేద నిపుణులు తెలిపిన సూచనలు మేరకు వివరాలు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..