Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stubborn Stains: దుస్తులకు పట్టిన మొండి మరకలు పోగొట్టడం ఎలా? ఇలా చేస్తే తళతళ మెరిసిపోతాయి.. అంతే..!

బట్టల విషయానికి వస్తే ఒక్కోసారి మరకలు పడటం సహజమే. అది చిందిన పానీయం అయినా, ఆహారం అయినా లేదా సిరా గుర్తు అయినా, మరకలను తొలగించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే, సరైన పరిజ్ఞానం మరియు సాంకేతికతలతో, మీరు వివిధ రకాల ఫాబ్రిక్ మరకలను సమర్థవంతంగా తొలగించడంతో పాటు మీ బట్టలు శుభ్రంగా మరియు తాజాగా ఉంచుకోవచ్చు.

Stubborn Stains: దుస్తులకు పట్టిన మొండి మరకలు పోగొట్టడం ఎలా? ఇలా చేస్తే తళతళ మెరిసిపోతాయి.. అంతే..!
Stain Removal Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 06, 2023 | 3:01 PM

బట్టల విషయానికి వస్తే ఒక్కోసారి మరకలు పడటం సహజమే. అది ఎలాంటి డ్రింక్ అయినా, ఆహారం అయినా, సిరా గుర్తు అయినా.. పడిన మరకలను తొలగించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ, రసాయనాలతో వివిధ రకాల ఫాబ్రిక్ మరకలను ఈజీగా తొలగించుకోవడంతో పాటు దస్తులను శుభ్రంగా, తాజాగా ఉంచుకోవచ్చు.

ఆహారపు మరకలు: దుస్తులపై ఆహారపు మరకలు పడితే వాటిని కొన్ని ఈజీ టిప్స్‌తో తొలగించుకోవచ్చు. చల్లటి నీటితో తడిసిన ప్రదేశాన్ని సున్నితంగా రఫ్ చేయడం ద్వారా ఈ మరకలను ఈజీగా తొలగించొచ్చు. కొద్ది మొత్తంలో డిష్‌వాషింగ్ లిక్విడ్, లాండ్రీ డిటర్జెంట్‌ను అప్లై చేయాలి. ఆపై యధావిధిగా వాటిని పిండాలి. దాంతో ఆహారపు మరకలు ఈజీగా తొలగిపోతాయి.

టీ, కూల్ డ్రింక్స్ మరకలు: కాఫీ, టీ, జ్యూస్ మరకలు కొంచెం ఇబ్బంది కరంగా ఉంటాయి. ముందుగా చల్లటి నీటితో మరకను కడిగి, ఆ తరువాత వైట్ వెనిగర్, ప్రత్యేక స్టెయిన్ రిమూవర్ మిశ్రమాన్ని అప్లై చేయడం ద్వారా ఈ మరకలను తొలగించొచ్చు.

ఇవి కూడా చదవండి

గ్రీజు/నూనె మరకలు: నూనెను పీల్చుకోవడానికి టాల్కమ్ పౌడర్, కార్న్‌స్టార్చ్, బేకింగ్ సోడా వంటి శోషన గుణాలున్న పదార్థాలను మరకపై వేయాలి. కొన్ని నిమిషాల తర్వాత బ్రష్‌తో మరకపై రుద్దాలి. ఆ తరువాత స్టెయిన్‌కు అప్లై చేయాలి. లాండరింగ్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి.

ఇంక్ మరకలు: ఏదైనా సిరా మరకలను తొలగించడానికి ముందుగా దానిని నీటితో కడగాలి. ఆ తరువాత రుబ్బింగ్ ఆల్కహాల్, ఇంక్ స్టెయిన్ రిమూవర్‌ని అప్లై చేసి ఉతకాలి. ఇలా త్వరగా ఇంక్ మరకలు తొలగిపోతాయి.

రక్తపు మరకలు: రక్తపు మరకలను తొలగించడానికి ముందుగా చల్లటి నీటితో కడగాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా చల్లని నీరు, ఉప్పు మిశ్రమంతో బ్రష్ చేయాలి. ఆ తరువాత చల్లని నీటిలో ఫాబ్రిక్‌ ఉతకాలి.

దుస్తులపై మరకలు పోవాలంటే.. వీలైనంత త్వరగా మరకలను కడగడం, వేడి నీటిని ఉపయోగించకుండా ఉండటం ముఖ్యం. ఇలా చేయడం వలన మరక త్వరగా తొలగిపోతుంది. వివిధ రకాల ఫాబ్రిక్ మరకలను తొలగించడం ద్వారా దుస్తులను ఉత్తమంగా చూసుకోవడంతో పాటు.. వాటి జీవిత కాలాన్ని పెంచొచ్చు.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?