Viral: అపార్ట్‌మెంట్ వాసులకు ఒక్కసారిగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటని వెళ్లి చూడగా.!
ఓ యువతి తన ఇంటికి దగ్గరలో ఉన్న యువకుడితో ప్రేమలో పడింది. అతడ్ని పూర్తిగా నమ్మింది. అయితే ఆ నమ్మకమే ఆమె కొంపముంచింది.
ఓ యువతి తన ఇంటికి దగ్గరలో ఉన్న యువకుడితో ప్రేమలో పడింది. అతడ్ని పూర్తిగా నమ్మింది. అయితే ఆ నమ్మకమే ఆమె కొంపముంచింది. ఆ యువకుడు ఆమెను పలుమార్లు అత్యాచారం చేయడమే కాదు.. పెళ్లి చేసుకున్నట్టు ఫేక్ ఫోటోలు కూడా తీసుకుని బెదిరించసాగాడు. అనంతరం కొద్దిరోజులకు వారిద్దరూ విడిపోయారు. అప్పటికీ అతడు శనిలా ఆమెను పట్టుకుని.. వేధించేవాడు. రోజురోజుకూ అతడి వేధింపులు మితిమీరిపోవడంతో.. ఆ యువతి మూడో అంతస్థు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. చివరికి.!
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల ఓ యువతికి సునీల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. కొద్దిరోజులు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. దీంతో అతడిపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంది సదరు యువతి. అయితే ఆ నమ్మకమే ఆమె కొంపముంచింది. 2021లో బాధితురాలిని సునీల్ వేరే ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై వీడియో తీసి.. ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా పలుమార్లు సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకున్నట్టుగా ఫేక్ ఫోటోలు కూడా తీసుకున్నాడు.
సునీల్ క్రూరత్వాన్ని గ్రహించిన ఆ యువతి.. అతడికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అయినా ఆమెను వదల్లేదు. వేధిస్తూనే ఉన్నాడు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. వాళ్లు అతడ్ని హెచ్చరించి వదిలేశారే తప్ప.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు.
పోలీస్ స్టేషన్‌కి వెళ్లొచ్చిన సునీల్.. ఆ తర్వాత రెండు నెలలు సైలెంట్‌గా ఉండి.. సదరు యువతిని ఫేక్ ఫోటోలు, అశ్లీల వీడియోతో బెదిరించ సాగాడు. దీంతో అతడి వేధింపులు తాళలేకపోయిన ఆ యువతి మూడు అంతస్థు నుంచి కిందకు దూకేసింది. కాగా, ఈ ఘటనలో బాధితురాలి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఖాకీలు.. విచారణ మొదలుపెట్టి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.