Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక అప్‌డేట్.. మనీశ్ సిసోడియా ఆస్తులు అటాచ్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు కేసు నడుస్తోందా? క్లోజ్ చేశారా అని అంతా అనుకుంటున్న సమయంలో సంచలన అప్‌డేట్ వచ్చింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దినేష్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ మనీశ్ సిసోదియాతో పాటు ఇతర నిందితులకు చెందిన కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్అయినమనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమ సిసోడియాతోపాటు ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్చేసింది. ఈడీ అటాచ్ చేసిన మొత్తంలో రూ.11.49 కోట్ల మనీశ్సిసోడియాకు చెందిన బ్యాంకు బ్యాలెన్సులు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెట్కు చెందిన రూ.16.45 కోట్లతో పాటు ఇతరత్రా కలిపి రూ.44.29 కోట్ల చరాస్తులు ఉన్నాయి. మొత్తంగా రూ. 52.24 కోట్లు సీజ్ చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది.
అలాగే, మనీలాండరింగ్చట్టం కింద మరో రూ. 7.29 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఈడీ. ఈ మొత్తంలో మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమ సిసోడియాకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. మరో నిందితుడు రాజేశ్ జోషికి చెందిన ఒక ఫ్లాట్, గౌతమ్మల్హోత్రాకు చెందిన కొంత ల్యాండ్కూడా ఈ అటాచ్‌మెంట్‌లో ఉన్నాయి. అయితే, దినేష్ అరోరాను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈడీ ఈ చర్యకు పూనుకోవడం సంచలనంగా మారింది. అంటే దినేష్ అరోరా ఇచ్చిన సమాచారం మేరకే ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీ అక్రమాలు జరిగాయని, మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు ఈడీ, ఇటు సీబీఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసులో మనీశ్ సిసోడియా సహా చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మనీశ్ సిసోడియా ఇప్పటికీ జుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..