Jasmeen Kaur Murder: పరాయి దేశంలో దుర్మార్గం.. జాస్మిన్‌ కౌర్ హత్య కేసులో వెలుగు చూసిన సంచనాలు..

అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిజాన్ని దాచి పెట్టాడు. తర్వాత అరెస్టై జైల్లో ఉన్నాడు. ఎట్టకేలకు నిజాన్నయితే ఒప్పుకున్నాడు. కానీ.. ఆ హత్య చేసిన తర్వాత డెడ్‌బాడీని ఎక్కడ పాతిపెట్టాడో కనిపెట్టడానికి పోలీసులకు చాలా రోజులు పట్టింది. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన జాస్మిన్‌ కౌర్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి

Jasmeen Kaur Murder: పరాయి దేశంలో దుర్మార్గం.. జాస్మిన్‌ కౌర్ హత్య కేసులో వెలుగు చూసిన సంచనాలు..
Jasmeen Kaur Murder
Follow us

|

Updated on: Jul 07, 2023 | 6:35 AM

అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిజాన్ని దాచి పెట్టాడు. తర్వాత అరెస్టై జైల్లో ఉన్నాడు. ఎట్టకేలకు నిజాన్నయితే ఒప్పుకున్నాడు. కానీ.. ఆ హత్య చేసిన తర్వాత డెడ్‌బాడీని ఎక్కడ పాతిపెట్టాడో కనిపెట్టడానికి పోలీసులకు చాలా రోజులు పట్టింది. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన జాస్మిన్‌ కౌర్ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆమెను పాతిపెట్టిన ప్లేస్‌ను గుర్తించిన పోలీసులు.. ఈ ఉన్మాద ఘటన జరిగిన తీరు చూసి షాక్‌ తిన్నారు.

భారత సంతతి యువకుడు తారిక్‌జ్యోత్‌ తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను అత్యంత కిరాతకంగా 2021లో హత్య చేశాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లూచేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. బతికుండగానే నిప్పంటించి.. సజీవంగానే పాతిపెట్టేశాడు. తన ప్రేమను కాదంది అనే ఒకే ఒక్క కారణంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ హత్య ఫ్లిండర్స్‌ రేంజెస్‌ ప్రాంతంలో జరిగింది. జాస్మిన్‌ మిస్సింగ్‌పై విచారణ చేసిన పోలీసులు చివరికి తారిక్‌జ్యోత్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. చివరికి అతనే నేరస్తుడని తేల్చారు. ఫిబ్రవరిలోనే నేరం రుజువైంది. తారిక్‌జ్యోత్‌ నేరం ఒప్పుకున్నాడు. కానీ ఆమెను పాతిపెట్టిన స్థలం కనిపెట్టేందుకు ఇన్ని రోజులు పట్టింది. ఆ ప్రాంతంలో నుంచి డెడ్‌బాడీ బయటకు తీసేప్పుడు ఎంత క్రూరంగా ఈ హత్య చేశాడో వెలుగు చూసింది.

పంజాబ్‌కు చెందిన జాస్మిన్‌ నర్సింగ్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడే తారిక్‌జ్యోత్‌ పరిచయం అయ్యాడు. తర్వాత అతని వికృత ప్రవర్తన నచ్చక దూరం పెట్టింది. ఈ కసితో రగిలిపోయి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తమ కుమార్తె హత్యకు గురైందన్న బాధనుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోలేకపోతోంది. దాదాపు 100 సార్లు అతని ప్రేమను నిరాకరించినా వెంటపడి వేధించి చివరికి ప్రాణం తీశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?