లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు.. మద్యం మత్తులో టికెట్ బార్‌లో వదిలేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే..
పాల్ లిటిల్ జనవరిలో లాటరీ టికెట్ కొన్నాడు. అయితే టికెట్ కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మద్యం కోసం వెళ్లిన అతడు ఈ టికెట్‌ను అక్కడే మర్చిపోయాడు. ఆ టిక్కెట్టు మద్యం దుకాణంలో వదిలేసి వెళ్లినట్లు కూడా అతనికి గుర్తులేదు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఓ మహిళకు సదరు వ్యక్తి వదిలిపెట్టిన టికెట్ దొరికింది.
లాటరీ టికెట్ ఫలితాలు చాలా మంది జీవితాలను మార్చేస్తుంటాయి. లాటరీ తగిలిన వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన అనేక సంఘటనలు ఇప్పటికే చాలా చూశాం. అయితే లాటరీ టిక్కెట్లకు సంబంధించి అమెరికాలో ఓ ఉత్కంఠభరితమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ కారు మెకానిక్ లాటరీలో రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. ఈ లాటరీ తీవ్ర కలకలం రేపింది. లాటరీ జాక్‌పాట్ గెలిచిన మెకానిక్ పేరు పాల్ లిటిల్. మీడియా కథనాల ప్రకారం.. అతను అమెరికాలోని మసాచుసెట్స్‌లో నివాసిస్తున్నాడు. పాల్ లిటిల్ జనవరిలో లాటరీ టికెట్ కొన్నాడు. అయితే టికెట్ కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మద్యం కోసం వెళ్లిన అతడు ఈ టికెట్‌ను అక్కడే మర్చిపోయాడు. ఆ టిక్కెట్టు మద్యం దుకాణంలో వదిలేసి వెళ్లినట్లు కూడా అతనికి గుర్తులేదు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఓ మహిళకు సదరు వ్యక్తి వదిలిపెట్టిన టికెట్ దొరికింది.
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఈ టికెట్ రిజల్ట్ రాగానే మెకానిక్ కొన్న టికెట్ కు 25 కోట్ల రూపాయల జాక్ పాట్ వచ్చిన విషయం తెలిసింది. మెకానిక్ పాల్ లిటిల్ పేరు కూడా ప్రకటించారు. అయితే, అతని చేతిలో టికెట్ లేదు. టికెట్ కోసం వెతికినా దొరకలేదు. టికెట్ కోసం వెతుకుతున్నప్పుడు, పాల్ లిటిల్ మద్యం దుకాణంలో టిక్కెట్టును విడిచిపెట్టినట్లు గుర్తుచేసుకున్నాడు. వెంటనే మద్యం షాపుకు వెళ్లి ఆరా తీశాడు. ఆ రోజు జరిగినదానిపై అక్కడి సిబ్బంది, స్థానికుల్నిప్రశ్నించగా అందరూ కనిపించలేదని చెప్పారు. టికెట్ దొరికిన మహిళ కూడా అబద్ధం చెప్పింది. తనకు టిక్కెట్టు కనిపించలేదనే బుకాయించింది.
అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లాటరీ కార్యాలయానికి వచ్చిన మహిళ రూ.25 కోట్లు గెలుచుకుంది. ఆమె గెలిచిన లాటరీ టిక్కెట్‌ని లాటరీ నిర్వాహకులకు చూపించింది. అయితే అక్కడున్న వారికి మహిళపై అనుమానం వచ్చి విచారించారు. దాంతో అన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు టిక్కెట్టు కొనుగోలు చేసిన పాల్ లిటిల్ ఆచూకీ తెలుసుకుని లాటరీ సొమ్మును అందజేసారు. అలాగే టికెట్ దాచుకున్న మహిళపై చీటింగ్ కేసుపెట్టి జైలులో పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..