AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల జాడ లేకుండా చేస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్‌షా అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ , ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే , జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా , రా అధికారులు హాజరయ్యారు.

Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల జాడ లేకుండా చేస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
Union Home Minister Amit Shah
Basha Shek
|

Updated on: Jan 03, 2024 | 6:30 AM

Share

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్‌షా అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ , ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే , జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా , రా అధికారులు హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్‌ సాక్షిగా జమ్ముకశ్మీర్‌ ప్రజలకు హామీ ఇచ్చింది. 2026 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం జాడ లేకుండా చేస్తామని ఈ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కూడా ఈ సమావేశంలో అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. గత రెండు నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగిపోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులు , సీఆర్‌పీఎఫ్‌ , ఆర్మీ బలగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని అమిత్‌షా సూచించారు. డిసెంబర్‌ రెండుసార్లు ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేశారు ఉగ్రవాదులు. రాజౌరిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు . ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది కేంద్రం . పాకిస్తాన్‌ నుంచి చొరబడ్డ 30 మంది ముష్కరుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగిస్తున్నాయి.

కాగా గతేడాది రాజౌరీ, పూంచ్, రియాసీ జిల్లాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 28 మంది ఉగ్రవాదులు, 19 మంది భద్రతా సిబ్బంది సహా 54 మంది మరణించారు. ముఖ్యంగా రాజౌరిలో 10 మంది ఉగ్రవాదులు, 14 మంది భద్రతా సిబ్బంది సహా 31 మంది మరణించారు. పూంచ్‌లో 15 మంది ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది హతమయ్యారు. రియాసిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత ఏడాది మేలో చమ్రేర్ అడవుల్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా, ఒక ఉన్నతాధికారి గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ విదేశీ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఉగ్రవాదుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని భద్రతా సంస్థలకు అమిత్‌ షా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా