AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: టీవీ9 ‘వాట్ ఇండియా టుడే’లో ‘జై కిసాన్, క్యా సమాధాన్’ కార్యక్రమం.. ప్రసంగించనున్న కేంద్ర మంత్రి..

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించనున్న 'వాట్ ఇండియా టుడే'లో 'జై కిసాన్, క్యా సమాధాన్' అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రైతుల డిమాండ్లను, వాటికి సంబంధించిన పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరగనుంది.

WITT: టీవీ9 'వాట్ ఇండియా టుడే'లో 'జై కిసాన్, క్యా సమాధాన్' కార్యక్రమం.. ప్రసంగించనున్న కేంద్ర మంత్రి..
Arjun Munda Witt
Srikar T
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 24, 2024 | 4:39 PM

Share

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించనున్న ‘వాట్ ఇండియా టుడే’లో ‘జై కిసాన్, క్యా సమాధాన్’ అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రైతుల డిమాండ్లను, వాటికి సంబంధించిన పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరగనుంది. ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ కార్యక్రమం ద్వారా టీవీ9 నెట్ వర్క్ పలు అంశాలపై చర్చించనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ఈ ఈవెంట్‎కు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొంటారు. దేశంలోని రైతుల అసంతృప్తితో పాటు వారి ఉద్యమం ముగింపుకు సంబంధించిన కొన్ని అంశాలను అర్జున్ ముండా ఉదహరించవచ్చు. 3 మంది కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే అర్జున్‎తో ఉద్యమాన్ని ముగించడంపై పలు దఫాలుగా చర్చలు జరిపింది. ‘జై కిసాన్, క్యా సమాధాన్’ అనే అంశంపై అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రైతుల డిమాండ్లు, వారి సమస్యల పరిష్కారంపై మాట్లాడవచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఇప్పుడు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని రైతులు చెబుతున్నారు.

గత రెండ్రోజులుగా సాగుతున్న రైతు ఉద్యమంపై వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఇప్పటికే మీడియా ముందు మాట్లాడారు. అనేక దఫాల చర్చల్లో కొన్ని విషయాల్లో అంగీకారం కుదరలేదు. వీటి సాధ్యాసాధ్యాలపై కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. రైతుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు 4సార్లు జరిగిన భేటీల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరిగాయి. అందరికీ ఆసక్తి కలిగించే అటువంటి పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాము అని తెలిపారు. చర్చల ద్వారానే ఈ పరిష్కారం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతుల ఉద్యమం ఢిల్లీకి చేరకుండా హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్, హర్యానాలోని అనేక జిల్లాల్లో ఇంటర్నెట్ కూడా నిషేధించబడింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుతో పాటు, పెన్షన్, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, విద్యుత్ రేట్ల పెంపు, 2020లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇలా 21 అంశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..