AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని.. ఎంత దారుణంగా తరలించారో తెలిస్తే..

అంబులెన్స్‌కు అంత డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం

అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించలేక యువకుడి మృతదేహాన్ని.. ఎంత దారుణంగా తరలించారో తెలిస్తే..
Man Body On Vehicle Roof
Jyothi Gadda
|

Updated on: Dec 08, 2024 | 9:39 PM

Share

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీ జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. హల్దుచౌడ్‌లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అభిషేక్ అనే 20ఏళ్ల యువకుడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.10 వేలకుపైగా డిమాండ్‌ చేశారు.

అంబులెన్స్‌కు అంత డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్‌ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us