కాంతివంతమైన స్కిన్ కోసం కలబంద ఫేస్ మాస్క్.. ఇలా వాడితే మచ్చలేని అందం మీ సొంతం..!
దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల సహజ కాంతి వస్తుంది. ముఖం బ్రైట్‌గా, అందంగా మారుతుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, పిగ్మంటేషన్, మొటిమల్ని దూరం చేస్తాయి.

కలబంద ఓ అద్భుతమైన ఔషధ మొక్క. ఎందుకంటే.. దాని నిండా ఔషధ గుణాలే నిండివున్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అది మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా కాస్మెటిక్ కంపెనీలు కలబంద గుజ్జుతో వందల కొద్దీ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నాయి. మరి డల్‌గా ఉన్న ముఖాన్ని కాంతివంతంగా, ముడుతలు లేకుండా చేసేందుకు కలబంద గుజ్జు ఎంతో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
అలోవెరా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.. దీనిని వాడితే చర్మం, జుట్టుకి చాలా మంచిది. అలోవెర్ జెల్ నేచురల్ మాయిశ్చరైజర్. దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల సహజ కాంతి వస్తుంది. ముఖం బ్రైట్‌గా, అందంగా మారుతుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, పిగ్మంటేషన్, మొటిమల్ని దూరం చేస్తాయి.
చాలా మందికి మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా చర్మంపై బ్లాక్ హెడ్స్ పేరుకుపోతాయి. దీనిని పోగొట్టేందుకు అలొవెరా స్క్రబ్ హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. మొటిమల సమస్యని దూరం చేసేందుకు ఖరీదైన క్రీమ్స్ రాయకుండా అలోవెరాని వాడొచ్చు. అలోవెరా జెల్‌లో నిమ్మరసంని కలపండి. నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. దీనిని నేరుగా ముఖానికి రాయొద్దు. జెల్‌లో మిక్స్ చేసి రాసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.
అలోవెరా జెల్‌లో కొద్దిగా తేనె కలిపి రాయండి. తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఇది చర్మాన్ని కాంతివంతంగా, రంగుని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్‌తో మీరు పిగ్మంటేషన్ దూరం చేసుకోవచ్చు. తేనెలో అలోవేరా జెల్ కలిపి రాసి 15 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. తేనెలో చర్మాన్ని రక్షించడంలో సహాయపడే ముఖ్యమైన పోషకాలు.
అలోవెర్ జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చెయొచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ ముఖంపై మ్యాజిక్ చేస్తుంది. ఇలా రాసి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. గంధం పొడిలో అలోవెరా జెల్ కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. దీనిని ముఖానికి అప్లై చేసినట్టయితే స్కిన్ టైట్ అవుతుంది. దీనికోసం మీరు వాడే గంధం నేచురల్‌ది మాత్రమే తీసుకోవాలి.
అదే విధంగా, వారానికి ఓసారి ముఖాన్ని స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండిలో నిమ్మరసం, అలోవెరా జెల్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఈ మాస్క్ బాగా ఆరిపోయాక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మెరుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








