IT Jobs: సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా జాబ్ కొట్టారు.. అనుమానం వచ్చిన మేనేజర్ ఆరా తీయగా.. షాకింగ్ నిజాలు..
ప్రజలు ప్రతీదానికి షార్ట్‌కట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చివరికి విజయానికి కూడా షార్ట్‌కట్ మార్గమే కావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను కూడా సింపుల్‌గా పొందాలనుకుంటున్నారు. మోసపూరిత...
ప్రజలు ప్రతీదానికి షార్ట్‌కట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చివరికి విజయానికి కూడా షార్ట్‌కట్ మార్గమే కావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను కూడా సింపుల్‌గా పొందాలనుకుంటున్నారు. మోసపూరిత విధానంలో ఉద్యోగాలను పొందే విధానం గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ తాజాగా ప్రైవేట్ సంస్థల్లోనూ ఈ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఐటీ నగరం బెంగళూరులో ఇలాంటి ఓ మోసమే వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రియాంక, కిరణ్ అనే ఇద్దరు అభ్యర్థులు బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఇటీవల ఉద్యోగంలో చేరారు. జూన్ 18న విధుల్లో చేరిన వీరిద్దరూ పనిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ ఇంటర్నల్ విచారణ ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయట పడింది. వీరిద్దరూ హెచ్‌ఆర్ అడిగే ప్రశ్నలను ముందుగానే తెలుసుకొని జాబ్ పొందారని విచారణలో తేలింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ హైరింగ్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి చెందిన నసీరుద్దిన్ (40) అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. కంపెనీ హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలో అడిగే టెక్నికల్ ప్రశ్నలు ముందుగానే ఉద్యోగులకు లీక్ చేసి ఉద్యోగం వచ్చేందుకు సహాయపడ్డారు. ఇందుకోసం రూ. 3 లక్షలు ఇచ్చినట్లు ఉద్యోగం పొందినవారిలో ఒకరైన కిరణ్ ఒప్పుకున్నాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 418, 419, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..