AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress President Polls: కాంగ్రెస్ నేతల మధ్య కాక పుట్టిస్తున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. శశి థరూర్‌‌పై కొందరు తెలంగాణ నేతల ఫైర్..

ఏఐసిసి ఎన్నికలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కాకా పుట్టిస్తుందా..? గాంధీ కుటుంబం ఒక వైపు ఉంటే కొంతమంది నేతలు మరోవైపు ఉన్నారా...? భరిలో నిలిచిన ఆ నేతపై టీకాంగ్రెస్ నేతలు ఎందుకు రగిలిపోతున్నారా...? హైదరాబాద్ వచ్చిన ఆ నేతకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదా..? ఇంతకీ ఏఐసిసి ఎన్నికల ప్రక్రియలో ఎం జరిగుతోంది ..?

Congress President Polls: కాంగ్రెస్ నేతల మధ్య కాక పుట్టిస్తున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక.. శశి థరూర్‌‌పై కొందరు తెలంగాణ నేతల ఫైర్..
shashi tharoor and revanth reddy
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2022 | 12:38 PM

Share

కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరొకవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగె ఏఐసిసి ఎన్నికల పైనే అంతే చర్చ జరుగుతుంది .. ఎందుకంటే ఇప్పటివరకు ఏఐసిసి అద్యక్ష పదవిలో ఉన్న గాంధీ కుటుంబం ఏఐసిసి ఎన్నికల బరిలో లేకపోవడంతో .. పోటీ చేసేందుకూ మల్లికార్జున్ ఖర్గే , శశిథరూర్ పోటీలో నిలిచారు . మల్లికార్జున్ ఖర్గే కి గాంధీ కుటుంబం అశీసులు ఉండటంతో అయన గెలుపు ఇక అనివార్యం కానుంది .. పోటీలో ఉన్న మరొక అభ్యర్థి శశిథరూర్ సైతం అద్యక్ష పదవిని కైవసం చేసుకోవాలనే పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారలో భాగంగా హైదరాబాద్ కి శశి థరూర్ వచ్చారు.. తెలంగాణ లో 119 నియోజకవర్గాలకు గాను 238 పిసిసి డెలిగేట్ ఓట్స్ ఉన్నాయి..ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కే సపోర్ట్ అని తెలంగాణ కాంగ్రెస్ తేల్చి చెప్పింది.. శశిథరూర్ రాకకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు నేతలు. శశిథరూర్ ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు కుడా కలవకపోవడం చర్చినీయంగా మారింది ..

పార్టీ అధ్యక్షుడినైతే ఏం చేస్తాననే విషయంపై కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ మేనిఫెస్టో తయారు చేశారు. మేమందరం ఒక్కటేనని, తమకు సిద్ధాంత వైరుధ్యాలు లేవన్నారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తమ చర్చ అన్నారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఫ్యామిలీలో అంతర్గత చర్చ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే స్టాండ్ అని శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తి మంతులు అనేదే ప్రధాన ప్రశ్న అన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్‌కి గాంధీ ఫ్యామిలీ కట్టుబడి ఉందన్నారు. తన విజన్ తనకుందని, ఖర్గే విజన్ ఆయనకుందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని, కానీ వెళ్ళలేకపోయానన్నారు. రేవంత్ పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్‌కు వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్ స్పష్టం చేశారు..

మల్లికార్జున ఖర్గే కే మా మద్దతు అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.శశిథరూర్ పోటీ నుండి తప్పుకొని ఖర్గే కి మద్దతు ఇవ్వాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అంటే.. మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్ మాత్రం శశిథరూర్ పై తీవ్రంగా మండిపడ్డారు. పదిసార్లు వరుసగా గెలిచిన మల్లికార్జున్ ఖర్గే కి గ్రౌండ్ రియాల్టీ తెలుసని .. అలాంటి నేతని డిబేట్ కి రావలనడం శశిథరూర్ కి సరికాదన్నారు. శశిథరూర్ కి ఉన్న అనుభవం ప్రజలకి చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. శశిథరూర్ మాకు చెప్పి నామినేషన్ వేయలేదని.. 900 కు పైగా ఉన్న ఓటర్లకి శశిథరూర్ ఎం చేయగలుగుతాడే చెప్పాలన్నారు. బ్రిటన్ సంస్కృతిని శశిథరూర్ ఇక్కడకి తీసుకురావాలని చూస్తే ఊరుకునేంది లేదని హెచ్చరించారు వీహెచ్.

ఇదిలావుంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మల్లికార్జున్ ఖర్గే మా తెలంగాణ బిడ్డ అయనపై ప్రేమ ఉంటుంది. అయన విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. నేను పీసీసీ అధ్యక్షుడిగా న్యూట్రల్ గా ఉంటాను .. హైదరాబాద్ కి వచ్చిన శశిథరూర్ నాకు ఫోన్ చేశారు. నెను ఉదయం కాఫీ కి రావాలని పిలిచానన్నారు. మా దగ్గర బంధువు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్లడం .. ఆయనను కలవలేకపోయా.. ఢిల్లీలో కలుస్త అని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో ఉత్సహాని తీసుకోస్తే .. మరికొన్ని రోజుల్లో జరిగే ఏఐసీపీ ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలని బయటపడేలా చేశాయి.. మొత్తానికి ఏఐసీసీ అద్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి..

మరిన్ని జాతీయ వార్తల కోసం