PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన రద్దు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఐసీసీలో జరిగే యూఎన్‌డబ్లూజీఏసీ సదస్సులో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా..

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన రద్దు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగం..
Pm Modi
Follow us

|

Updated on: Oct 04, 2022 | 3:01 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన రద్దయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఐసీసీలో జరిగే యూఎన్‌డబ్లూజీఏసీ సదస్సులో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలావుంటే.. మునుగోడు ఉప ఎన్నికపై ఇటు బీజేపీ స్పీడ్ పెంచింది. మునుగోడు బైపోల్‌పై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇప్పటికే స్పెషన్ ఫోకస్ పెట్టారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా దీనిని సెమీఫైనల్స్‌గా మార్చి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొందాలని బీజేపీ ఆశిస్తోంది.

ఇలావుంటే, ఇప్పుడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మునుగోడుపై అధిపత్యం కోసం శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గెలుపు తమదంటే తమదనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. దాంతో మునుగోడు ఉప ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీలూ తమ అభ్యర్ధులపై కొండంత నమ్మకం పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరుస ఓటములను చవిచూసింది. దీంతో మునుగోడు ఉపఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కీలకం కానుంది. ఇటు కాంగ్రెస్, బీజేపీ కూడా తెలంగాణలో తమ పట్టు సాధించేందుకు తహతహలాడుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకతపైనే కాంగ్రెస్‌, బీజేపీ గంపెడాశలు పెట్టుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు