AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir DG Murder: జమ్ముకశ్మీర్ జైలు డీజీ దారుణ హత్య.. గొంతు కోసి పారిపోయిన..

జమ్ముకశ్మీర్ జైలు డీజీ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్​వాలాలోని ఆయన ఇంట్లోనే..

Jammu Kashmir DG Murder: జమ్ముకశ్మీర్ జైలు డీజీ దారుణ హత్య.. గొంతు కోసి పారిపోయిన..
Jammu Kashmir Dg Murder
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2022 | 11:35 AM

Share

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్​వాలాలోని ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు డీజీ హేమంత్ కుమార్ గొంతు కోసి హత్య చేసినట్లుగా గుర్తించారు. అనంతంరం మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటన జరిగిన సమయం నుంచి ఆయన ఇంటి పని మనిషి యసీర్ అహ్మద్ కనిపించడం లేదు. ఈ హత్యకు అతనికి ఏదైన సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న యసీర్ అహ్మద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నేరం జరిగిన ప్రదేశంలో పలు కీలక ఆధారాలు లభించాయి. హత్య జరగడానికి ముందు డీజీ హేమంత్‌ పాదం వాచిందని లోహియా ఏదో నూనె రాసుకుంటున్నట్టు తెలిసింది. ఆ సమయంలో నిందితుడి డీజీకి ఊపిరి ఆడకుండా చేసి.. అనంతరం పగిలిన సీసాతో గొంతు కోసినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.

లోహియా గదిలో మంటలు రావడాన్ని గమనించి భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోపల నుంచి లాక్ చేసి ఉన్న గది తలుపులను బద్దలుకొట్టి వారు వెళ్లారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన కొన్ని సీసీటీవీ ఫుటేజీల్లో నిందితుడు నేరం చేసిన తర్వాత పారిపోయినట్లు గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. దాదాపు 6 నెలలుగా అతను ఈ ఇంట్లో పని చేస్తున్నాడని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హేమంత్ లోహియా హత్య కేసులో ఆయన జమ్మూకశ్మీర్ డీజీపీ నుంచి పూర్తి నివేదిక తీసుకున్నారు. దీంతో పాటు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

1992 బ్యాచ్ ఐపీఎస్

1992 బ్యాచ్‌కు చెందిన హేమంత్ కుమార్ లోహియా.. ఆగస్టులో పదోన్నతి పొంది జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. నవరాత్రులకు సంబంధించి హేమంత్ కుమార్ లోహియా శ్రీనగర్ నుంచి జమ్మూ వచ్చారు. అతని అధికారిక నివాసంలో కొన్ని పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా అతని కుటుంబం మొత్తం రాజీవ్ ఖజురియా ఇంట్లోనే ఉన్నారు. ఈ హత్య చేసిన తర్వాత అదే బెడ్‌రూమ్‌లోని మరో డోర్‌లో నుంచి నిందితుడు తప్పించుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం