CM KCR: కలిసొచ్చేది ఎవరు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో.. జాతీయ పార్టీ ఏర్పాటు వైపు కేసీఆర్ వడివడిగా అడుగులు..

కేసీఆర్ జాతీయ పార్టీపై ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ వెంట నడిచే ఏపీ నేతలు ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో BRSను నడిపించే నాయకుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అలాగే ఏ రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఎలాంటి మద్దతు లభిస్తోందో ఓ సారి చూద్దాం..

CM KCR: కలిసొచ్చేది ఎవరు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో.. జాతీయ పార్టీ ఏర్పాటు వైపు కేసీఆర్ వడివడిగా అడుగులు..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 04, 2022 | 10:00 AM

జాతీయ పార్టీ ఏర్పాటు వైపు కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని నిర్ణయించిన గులాబీ బాస్‌ బుదవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. బుదవారం సమావేశానికి 283 మందిని ఆహ్వానించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఎల్లుండి ఈసీ వద్దకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈసీకి పత్రాలు సమర్పించిన వెంటనే పార్టీ పేరు మారిపోతుందా..? లేక సమయం పడుతుందా..? మునుగోడులో కొత్త పేరులో పోటీ జరుగుతుందా..? అన్నది తేలాల్సి ఉంది. దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రసంగిస్తారు. అనంతరం టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ ఏకవాక్య తీర్మానం చేస్తారు. దీనికి సభ్యుల మద్దతు తెలిపిన అనంతరం ఆమోదిస్తారు. తరువాత పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తారు. ఆ వెంటనే జెండాను విడుదల చేస్తారు.

కేసీఆర్ వెంట నడిచేది ఎవరో..

ఇక ఏపీలో కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే.. ఆయనతో నడిచే ఏపీ నేతలు ఎవరెవరు అన్నదానిపై హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు ఏపీ నేతలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ నేరుగా కలిసి ఆహ్వానిస్తే ఆయనతో నడిచేది ఎవరన్నది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న డిఎంకే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. అన్నాడిఎంకే సొంత పార్టీలోనే అనేక లుకలుకలు. ప్రస్తుతం ఆపార్టీ బీజేపీ జట్టులోనే ఉంది.

కర్నాటకలో ఏవరి మద్దతు లభిస్తుందంటే..

కర్ణాటక విషయానికి వస్తే అధికారంలో బీజేపీ ఉంది. గతంలో అక్కడ కాంగ్రెస్- జేడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుతం అంత సత్సంబంధాలు ఇప్పుడు ఆ రెండు పార్టీలకు లేవు. జేడీఎస్ కేసీఆర్ మద్దతు పలికే ఛాన్స్ ఉంది.

కమ్యునిస్టుల కోటాలోకి దారేది..

కేరళలో లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలో ఉంది. లెఫ్ట్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయనీ, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తోనే వెళ్తామని ఇప్పటికే చెప్పేశాయి.

ఆ రెండు పార్టీలు ఆహ్వానిస్తాయా?

మహారాష్ట్రలో చూస్తే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలైన శివసేన,ఎన్సీపీ ఇప్పటికే తమ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మరి మహారాష్ట్రాలో కేసీఆర్ జాతీయ పార్టీని ఆ రెండు పార్టీలు ఆహ్వానిస్తాయా?

ఒడిశాలోకి ఎవరితో ఎంట్రీ..

ఇక ఒడిశాలో అక్కడ బీజూ జనతాదళ్ అధికారంలో వరుసగా కొనసాగుతూ వస్తుంది. నవీన్ పట్నాయక్ కేసీఆర్‌కు రెడ్ కార్పెట్ వేస్తారా?

బీహారీలు కలిసివస్తారా..

ఇక బీహార్‌లో ఆర్జేడీ, జేడియూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో కాంగ్రెస్ సహకారం కూడా ఉంది. వారు కాంగ్రెస్ తోనే ఉంటారా? కేసీఆర్ సపోర్ట్ చేస్తారా?

రానిచ్చే పరిస్థితి ఉందా..?

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వేరే ఏ పార్టీ తన రాష్ట్రంలోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఆమె దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని చూస్తున్నారు.

తానే పుంజుకోవాలని చూస్తోంది.. ఈ సమయంలో..

ఇక ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ..తానే సొంతంగా అన్నీ రాష్ట్రాల్లో పుంజుకోవాలని చూస్తోంది.

కశ్మీరీల సపోర్ట్ దొరుకుతుందా..

కాశ్మీర్‌లో ఉన్నది PDP. కానీ జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరేన్స్ పార్టీలు కేసీఆర్ కు ఏమాత్రం మద్దతు తెలుపుతాయో తెలియని పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గులామ్ నబీ అజాద్ కేసీఆర్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

కేసీఆర్‌ ఎజెండా ఏంటి? అజెండా ఏంటి ?

ఇక కేసిఆర్ ఆల్ ఇండియా పార్టీ ఏం చేయబోతోంది. దాని ఉద్దేశ్యం ఏమిటీ? ఏం చెప్పాలనుకుంటుంది? కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీ ఎందుకు భిన్నం? తన పార్టీ ఎజెండా ఏంటి? అజెండా ఏంటి ?అనే విషయాలకు కేసిఆర్ క్లారిటీ ఇవ్వాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

 

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..