Vidarbha State: మళ్లీ తెరపైకి ‘విదర్భ’ వివాదం.. సీఎం సభలో ప్రత్యేక రాష్ట్రం నినాదాలు.. వీడియో
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కు ఊహించని పరిణామం ఎదురైంది. సీఎం ప్రసంగిస్తున్న వార్దాలోని సాహితీ సదస్సులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కు ఊహించని పరిణామం ఎదురైంది. సీఎం ప్రసంగిస్తున్న వార్దాలోని సాహితీ సదస్సులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. సీఎం ముందే విదర్భ అనుకూల నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని గట్టిగట్టిగా స్లోగన్స్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది నిరసన తెలిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు. దీంతో మహారాష్ట్రలో మరోసారి విదర్భ పోరాటం తీవ్రతరమైంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్న నిరసన కారులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు.
విదర్భ పరిధిలో ఉన్న నాగపూర్, అమరావతి, అకోలా, వర్దా, చంద్రపూర్, గడ్చిరోలి, గోందియా, భండారా, బుల్ధాణా, యవత్మల్ జిల్లాలను కలిపి విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అనుకూలవాదులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బలంగా మద్దతు ప్రకటించింది. గతంతో రాజీవ్ గాంధీ టైంలో సానూకూలమైన నివేదక ఇచ్చినప్పటికీ కారణాంతరాల వల్ల అది ఆచరణకు నోచుకోలేదు.
#WATCH | Maharashtra: Two people raised slogans in front of CM Eknath Shinde regarding the demand of Vidarbha state, during the Literary Conference program in Wardha.
Police detained both of them. pic.twitter.com/4yvto3yapi
— ANI (@ANI) February 3, 2023
ఇప్పుడు తాజాగా, మరోసారి విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రతిపాధికణ విదర్భను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విదర్భ రీజియన్‌లో నాగపూర్ పట్టణం బత్తాయి, పత్తి పంటల సాగుకు పేరుగాంచింది. రాష్ట్రంలోని ఖనిజ సంపద మూడు వంతులు ఈ ప్రాంతంలో ఉంది.
విద్యుదుత్పత్తి, అటవీ వనరులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నటికీ తాము అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే తమకు మనుగుడ ఉంటుందని, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని విదర్భ అనుకూలస్తులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..