TV9 Global Summit: నేడే టీవీ9 గ్లోబల్ సమ్మిట్.. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ పేరుతో మెగా థాట్ ఫెస్ట్..
TV9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ రేపు ప్రారంభం కాబోతోంది. 'వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్' పేరుతో మెగా థాట్ ఫెస్ట్..
TV9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ రేపు ప్రారంభం కాబోతోంది. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్’ పేరుతో మెగా థాట్ ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది. జూన్ 17, 18 తేదీల్లో న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడా రంగాలపై చర్చ సాగనుంది. అత్యంత ప్రభావవంతమైన జాతీయ, అంతర్జాతీయ వక్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం సమ్మిట్ లక్ష్యం. వివిధ రకాల థీమ్‌లను కవర్ చేస్తూ 75 మంది స్టార్ స్పీకర్‌లను హోస్ట్ చేయనుంది టీవీ9. ముఖ్యంగా విశ్వగురు How Near, How Far థీమ్‌తో సమ్మిట్ జరగనుంది. జూన్ 17వ తేదీ ఉదయం 11 గంటలకు TV9 నెట్‌వర్క్ CEO బరున్ దాస్ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది.
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు, సీనియర్ ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు కూడా ప్రసంగించనున్నారు. తొలి రోజు సమ్మిట్‌లో అంటే జూన్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 18న రెండో రోజు సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. మొత్తం మీద, 15 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులు భారతదేశం కోసం తమ విశ్వ గురు విజన్‌ను పంచుకుంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా సమ్మిట్ థీమ్‌పై ప్రసంగిస్తారు.
టీవీ9 ఆతిథ్యమిస్తున్న తొలి గ్లోబల్ సమ్మిట్‌లో UK మాజీ పీఎం డేవిడ్ కామెరూన్ “ఇండియా ఇన్ ది న్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్” థీమ్‌పై ప్రసంగించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రధాని హమీద్ కర్జాయ్ “టెర్రరిజం: ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ” అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఈ అంశాలపై ఆ ఇద్దరు నేతలతో TV9 CEO బరున్ దాస్ మాట్లాడుతారు.
ఇక భారత్ విశ్వగురువుగా మారేందుకు ఎలాంటి బ్లూప్రింట్ అవసరం అనే అంశానికి సంబంధించింది ఈ థాట్‌ఫెస్ట్ అన్నారు TV9 CEO బరున్ దాస్. భారతదేశ ప్రయాణం సవాళ్లు లేనిది కాదని, కానీ.. లక్ష్యం అంతకంటే పవిత్రమైనదని బరున్ దాస్ అన్నారు. భారతదేశం ‘విశ్వ గురువు’గా మారాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి స్వేచ్ఛా వాతావరణంలోని చర్చల ద్వారా ఆలోచనలను రూపొందించడమే.. ఈ ఈవెంట్ అంతిమ లక్ష్యమని చెప్పారు బరుణ్ దాస్. ఈ ఈవెంట్ రాజకీయాలు – పాలన, వ్యాపారం – ఆర్థికం, సామాజిక-సంస్కృతి – ఆరోగ్య సంరక్షణ, క్రీడలు – వినోదం అనే నాలుగు స్తంభాల చుట్టూ తిరిగేలా ప్లాన్ చేయబడింది.