AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Network Global Summit: రెండో రోజుకు టీవీ9 నెట్‌వర్క్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. నేడు ప్రసంగించనున్న ప్రముఖులు వీరే..

TV9 Network Global Summit:టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్‌ పెస్ట్‌ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ నేడూ కొనసాగనుంది. 'విశ్వగురు How Near, How Far' అనే థీమ్‌తో జరుగుతున్న ఈ గ్లోబల్ సింపోజియంలో..

TV9 Network Global Summit: రెండో రోజుకు టీవీ9 నెట్‌వర్క్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. నేడు ప్రసంగించనున్న ప్రముఖులు వీరే..
Tv9 Global Summit
Basha Shek
|

Updated on: Jun 18, 2022 | 7:40 AM

Share

TV9 Network Global Summit:టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్‌ పెస్ట్‌ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ నేడూ కొనసాగనుంది. ‘విశ్వగురు How Near, How Far’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు దోహదపడే వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు పలువురు ప్రముఖులు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరుగుతోన్న ఈ శిఖరాగ్ర సమావేశంలో రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడా రంగాల్లో భారత్‌ సాధించాల్సిన ప్రగతి, లక్ష్యాలపై చర్చ జరుగుతోంది. ఇక శనివారం (జూన్‌ 18) నాటి సమావేశంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.. ‘సెక్యూరింగ్‌ ఇండియా.. టుడే అండ్‌ టుమారో’ అనే అంశంపై మొదట ప్రసంగించనున్నారు.

రెండో రోజు ప్రసంగించనున్న ప్రముఖులు వీరే..

☛ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.. ‘సెక్యూరింగ్‌ ఇండియా.. టుడే అండ్‌ టుమారో’ అనే అంశంపై మొదట ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి

☛ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ – ‘ద డిజీ- గ్లోబల్‌ నేషన్‌

☛ పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్‌ ఎస్‌ పూరి -‘ ఇన్‌క్లూజివ్‌ ఇండియా’

☛ అనురాగ్‌ ఠాకూర్‌- ‘బిగ్‌ పిక్చర్‌: లేవేరేజింగ్‌ ఇండియాస్‌ సాఫ్ట్‌ పవర్‌’

☛మహేంద్ర పాండే- ‘ఆత్మనిర్భర్‌ భారత్‌: ఇన్‌క్లూజివ్‌ ఆర్‌ ఎక్స్‌ క్లూజివ్‌’

☛రాఘవ్‌ చద్దా, తేజస్వి సూర్య – ‘జనరేషన్‌ నెక్ట్స్‌ టాక్స్‌’

☛స్మృతి ఇరానీ- ఎస్‌.. వియ్‌ కెన్‌

☛కాన్నాడ్‌ సంగ్మా (మేఘాలయ ముఖ్యమంత్రి)- రైజింగ్‌ మేఘాలయ

☛అనుపమ్‌ సిబాల్‌ ( అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌)- హెల్త్‌, ఇండియాస్‌ న్యూ హెల్త్‌

☛ధర్మేంద్ర ప్రధాన్‌- స్కిల్లింగ్‌ ఇండియా: ఏ న్యూ గ్లోబల్‌ ప్యారడిజం

☛అంజు బాబీ జార్జ్‌, పుల్లెల గోపీచంద్‌- 50 మెడల్స్‌ క్వెస్ట్‌ ఇన్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌

☛డేవిడ్‌ కామెరూన్‌ (UK మాజీ ప్రధాని) – ఇండియా ఇన్‌ ద న్యూ ఇంటర్నేషనల్‌ ఆర్డర్‌

☛శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి) – హార్ట్‌ ఆఫ్‌ ఇండియా

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.