Election Results 2023: ఈశాన్యం ఎవరిది..? నేడే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఈశాన్యం ఎవరిదో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. మరి, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచేదెవరు?. ఎడ్జ్ ఎవరికుంది? ఎగ్జిట్ పోల్స్ ఏముంటున్నాయ్? ఓ సారి చూద్దాం..

ఈశాన్య భారతం ఎవరిదో ఇవాళ తేలిపోనుంది. మరికాసేపట్లో మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో గెలుపెవరిదో, ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున స్థానాలున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కచ్చితంగా గెలవాల్సిన సీట్లు 31. అంటే, మ్యాజిక్ ఫిగర్ 31 అన్నమాట. అయితే, మేఘాలయలో మొత్తం 60 సీట్లుంటే 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. యూడీపీ అభ్యర్ధి ఆకస్మిక మరణంతో ఒకచోట ఎన్నిక వాయిదా పడింది.
ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ… ఎన్‌పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్ ఈస్డ్ డెమొక్రటిట్ అలయన్స్ గవర్నమెంట్ కొనసాగుతోంది. ఈసారి నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. క్రైస్తవులపై దాడులు ప్రధానాంశంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.
అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ త్రిపురలో మళ్లీ బీజేపీదే గెలుపు అంటున్నాయి. ఏ సర్వే చూసినా త్రిపురలో బీజేపీకే ఎడ్జ్ అంటూ తేల్చిచెప్పేశాయి. ఇక, మేఘాలయలో హంగ్ అసెంబ్లీ గ్యారంటీ అంటున్నాయ్ ఎగ్జిట్ పోల్స్. మేఘాలయలో బీజేపీ అలయన్స్‌కు 38 నుంచి 48 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. నాగాలాండ్‌లో అయితే బీజేపీ-ఎన్‌డీపీపీ కలిసి విక్టరీ కొడతాయని చెబుతున్నాయ్ సర్వేలు. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేదా?. మరికాసేపట్లోనే తేలిపోనుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం..