అరేయ్ ఏంట్రా ఇది.. జీపీఎస్‌ను నమ్ముకుంటే నేరుగా సముద్రంలో వెళ్లి పడ్డారు..

జీపీఎస్‌ను నమ్ముకున్న ఇద్దరు పర్యాటకులు నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు. ఆ చుట్టపక్కల పడవల వాళ్లు చూసి నీటిలో దూకి వారిని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని హవాయిలో ఉన్న హూనోకోహౌ స్మాల్‌బోట్‌ హార్బర్‌ ప్రాంతానికి ఇద్దరు పర్యాటకులు శనివారం ఓ ఎస్‌యూవీలో వచ్చారు.

అరేయ్ ఏంట్రా ఇది.. జీపీఎస్‌ను నమ్ముకుంటే నేరుగా సముద్రంలో వెళ్లి పడ్డారు..
Suv Drives Into Sea
Follow us

|

Updated on: May 03, 2023 | 8:51 PM

జీపీఎస్‌ను నమ్ముకున్న ఇద్దరు పర్యాటకులు నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు. ఆ చుట్టపక్కల పడవల వాళ్లు చూసి నీటిలో దూకి వారిని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని హవాయిలో ఉన్న హూనోకోహౌ స్మాల్‌బోట్‌ హార్బర్‌ ప్రాంతానికి ఇద్దరు పర్యాటకులు శనివారం ఓ ఎస్‌యూవీలో వచ్చారు. అయితే వారు మాంటరే ఎక్స్‌కర్షన్‌ అనే ప్రదేశానికి వెళ్లేందుకు తమ కారులోని జీపీఎస్‌ను అనుసరిస్తూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. అలా వెళ్తుండగానే వారి ఎస్‌యూవీ నేరుగా హార్బర్‌లోకి వెళ్లి సముద్రంలో పడింది. ఆ సమయంలో వారు సీట్‌ బెల్ట్‌లు పెట్టుకొని ఉన్నారు.

అయితే అక్కడ ఉన్న పడవలలోని సిబ్బంది వారిని గమనించారు. వెంటనే నీటిలోకి దూకి కారులో చిక్కుకుపోయిన ప్రయాణికురాలిని వెలికి తీయగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ కారుకు తాళ్లు కట్టి ఒడ్డుకు లాగారు. కారులో ప్రయాణించేవారు సముద్రం దిశగా వెళుతున్నామన్న ఎటువంటి ఆలోచన లేకుండా డ్రైవింగ్‌ చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి