36 గంట‌ల పాటూ భార‌త ఆర్మీ గోవాను ముట్ట‌డించి విముక్తి క‌ల్పించాయి.. నేడు గోవా విముక్తి దినోత్స‌వం

భారత్‌లో ప్రముఖ పర్యాటక స్థలమైన గోవా ఏడాది పొడవునా దేశ విదేశీ పర్యాటకు తాడికి అధికంగానే ఉంటుంది. ప్రతి సీజన్‌ కూడా ఇక్కడ పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందిస్తుంది....

36 గంట‌ల పాటూ భార‌త ఆర్మీ గోవాను ముట్ట‌డించి విముక్తి క‌ల్పించాయి.. నేడు గోవా విముక్తి దినోత్స‌వం
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2020 | 10:11 AM

భారత్‌లో ప్రముఖ పర్యాటక స్థలమైన గోవా ఏడాది పొడవునా దేశ విదేశీ పర్యాటకు తాడికి అధికంగానే ఉంటుంది. ప్రతి సీజన్‌ కూడా ఇక్కడ పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందిస్తుంది. ఏడాదిలో అన్ని మాసాలతో పోల్చుకుంటే డిసెంబర్‌ మాసంలో గోవా పర్యటన ప్రత్యేకమనే చెప్పాలి. ఈనెలలో గోవా పర్యటనకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతూనే ఉంది. వేసవి కాలం, వర్షాకాలం కంటే శీతాకాలంలో ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం, చల్లని ప్రదేశం మధ్య అన్ని రకాలుగా ఎంజాయ్‌ చేయవచ్చు. కార్లు, బైక్‌లను అద్దెకు తీసుకుని విహారించవచ్చు. నైట్ షాపింగ్స్‌, రెస్టారెంట్లు, రుచికరమైన భోజనం లాంటివి చేస్తూ ఎంజాయ్‌ చేయవచ్చు. ఇలాంటి ఎంజాయ్‌మెంట్ కోసం చాలా మంది ప‌ర్యాట‌కులు గోవా టూర్ ను ఎంచుకుంటారు.

గోవా విముక్తి దినోత్సవం

డిసెంబర్‌ 19న గోవా విముక్తి దినోత్సవం. 1947లో భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా.. గోవా, డమన్‌ అండ్‌ డయ్యూలకు మాత్రం స్వేచ్ఛ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి శతాబ్దాలుగా అక్కడే పాతుకుపోయారు. గోవాను భారతదేశానికి ఇవ్వడానికి పోర్చుగీసు సర్కార్‌ నిరాకరించకపోవడంతో భారత ఆర్మీ 1961 డిసెంబర్‌ 18న వారిపై యుద్దాన్ని ప్రకటించింది. ఈ యుద్ధానికి భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌ అనే నామకరణం చేసింది. దీనిలో భాగంగా దాదాపు 36 గంటల పాటు భారత భద్రతా దళాలు, వాయు, నావిక దళాలు గోవాను ముట్టడించి 450 ఏళ్ల పోర్చుగీసుల పాలన నుంచి ఈ భారత భూభాగానికి విముక్తి కల్పించాయి.

భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పోర్చుగీసు వారి నుంచి గోవాను ద‌క్కించుకునేందుకు భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేసిన ప్ర‌యత్నాలు ఫ‌లించాయి. దీంతో ప్రతియేటా డిసెంబర్‌ 19వ తేదీన గోవా విముక్తి దినోత్సవాన్ని (గోవా లిబరేషన్‌ డే)ను ఘనంగా నిర్వహించుకుంచుకుంటున్నారు. డిసెంబర్‌ లో గోవాకు వెళ్లేవారు ఈ వేడుకలను చూడవచ్చు.

ఏడాదిలో అన్ని నెల‌ల కంటే డిసెంబర్ నెల‌‌ గోవాలో పెద్ద పార్టీ సీజన్‌ అనే చెప్పాలి. రాత్రి 10 గంటలకు పార్టీ ప్రారంభమై తెల్లవారుజాము వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. మిరుమిట్లు గొలిపే లైట్స్‌, లైవ్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, డ్రింకింగ్, రుచికరమైన భోజనం ఇలా ఎన్నో అనుభూతులు పొందవచ్చు. ఇక ప్రత్యేకంగా న్యూఇయ్‌ వేడుకలను ఎప్పటికీ మర్చిపోలేరు.

క్రిస్మస్‌ వేడుకలు

కాగా, గోవాలో క్రిస్మస్‌ పండగ రోజున గోవా ఎంతో వైభవంగా కనిపిస్తుంది. బీచ్‌లు, వీధులు, స్టార్స్‌, లైట్స్‌, క్రిస్మస్‌ టీలతో, అక్క‌డ ప‌ర్యాట‌కుల‌ను క‌నువించే చేసే విధంగా అలంకరించబడి ఉంటుంది. దీంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ దాదాపు 400 వరకూ చర్చిలు ఉన్నాయి. గోవాలోని చాలా ప్రదేశాల్లో క్రిస్మస్‌ డిన్నర్‌లతో పాటు వివిధ ఆట పాటలతో తెల్లవారే వరకూ హంగామా ఉంటుంది. అందుకే ప్ర‌తి యేడాది సెంబ‌ర్ గోవాలో ప్ర‌త్యేక కార్యక్ర‌మాలు కొన‌సాగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్ర‌తి నెలకంటే ఈ డిసెంబర్ నెల‌లో ప‌ర్యాట‌కుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకు అక్క‌డి ప్ర‌భుత్వ ప‌ర్యాట‌కుల కోసం అన్న విధాల ఏర్పాట్లు చేస్తుంటుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!