Tamil Nadu: షాకింగ్ ఇన్సిడెంట్.. శ్మశానంలో చిన్నారి డెడ్ బాడీ.. తలను ఎత్తుకెళ్లిన దుండగులు..
విస్తృతంగా పెరిగిపోతున్న సాంకేతికత, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అయితే కొన్ని చోట్ల, మారుమూల ప్రాంతాల్లో ముఢ నమ్మకాలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. ఇంకా ఉన్నామంటూ..

విస్తృతంగా పెరిగిపోతున్న సాంకేతికత, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. అయితే కొన్ని చోట్ల, మారుమూల ప్రాంతాల్లో ముఢ నమ్మకాలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. ఇంకా ఉన్నామంటూ గుర్తు చేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా క్షుద్రపూజల గురించి చెప్పుకోవాలి. శ్మశానంలో అమావాస్య కారణంగా చేసిన క్షుద్ర పూజలు ఆ గ్రామంలో అలజడి సృష్టించాయి. పక్కనే ఉన్న దృశ్యాన్ని చూసి వారి గుండెలు అదిరిపోయాయి. ప్రమాదవశాత్తు చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని గోతి నుంచి బయటకు తీసి ఉండటం, తలను ఖండించి తీసుకెళ్లిన ఆనవాళ్లను చూసి భయంతో వణికిపోయారు. వెంటనే లేట్ చేయకుండా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా చిత్తిరవాడి గ్రామంలో పాండియన్ అనే వ్యక్తి అతని కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి ఆరో తరగతి చదువతున్న కుమార్తె కృత్తిక సంతానం. ఈ నెల 5న అవురిమేడు గ్రామంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి కృత్తిక వెళ్లింది. అక్కడ పిల్లలతో ఆడుతున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం విరిగి కృత్తికపై పడింది. వెంటనే అలర్ట్ అయిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నారి మృతదేహాన్ని స్థానిక శ్మశానంలో ఖననం చేశారు.
ఈ నెల 25న అమావాస్య నాడు రాత్రి.. ఖననం చేసిన చోట క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే.. ఆ సమయంలో బాలిక కుటుంబసభ్యులు పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. శ్మశానంలో ఖననం చేసిన డెడ్ బాడీ నుంచి బాలిక తలను ఖండించి దుండగులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షుద్రపూజల కోసం తలను మాంత్రికుడు తీసుకెళ్లాడా? లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణాలలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..