Telecom Bill: టెలికాం రంగంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం.. వాటికి ఇకపై లైసెన్స్‌ కావాల్సిందే..

పాత చట్టాలకు మెరుగులు దిద్దుతోన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం, ఇప్పుడు టెలికాం రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండియన్‌ టెలీ కమ్యూనికేషన్‌ బిల్‌-2022 పేరుతో డ్రాఫ్ట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

Telecom Bill: టెలికాం రంగంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం.. వాటికి ఇకపై లైసెన్స్‌ కావాల్సిందే..
Telecom Bill
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 23, 2022 | 6:00 AM

Indian Telecommunication Bill 2022: పాత చట్టాలకు మెరుగులు దిద్దుతోన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం, ఇప్పుడు టెలికాం రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండియన్‌ టెలీ కమ్యూనికేషన్‌ బిల్‌-2022 పేరుతో డ్రాఫ్ట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. కాలం చెల్లిన పాత చట్టాల స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. మారుతోన్న కాలానికి, టెక్నాలజీకి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త బిల్లుకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం ముసాయిదాను ప్రజల ముందుపెట్టిన ఎన్డీఏ సర్కార్‌, ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. కొత్త బిల్లు ఆమోదం పొందితే, పాత చట్టాలైన ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, వైర్‌లెస్‌ టెలీగ్రఫీ యాక్ట్‌ 1993, టెలీగ్రాఫ్‌ వైర్స్‌ యాక్ట్‌ 1950 రద్దు కానున్నాయి. 21వ శతాబ్దానికి అనుగుణంగా కొత్త రూల్స్‌ను ఫ్రేమ్‌ చేసింది టెలీ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖ. కొత్త డ్రాఫ్ట్‌కు రూపకల్పన చేస్తున్నప్పుడు అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా చట్టాలను కూడా పరిశీలించినట్లు తెలిపింది. టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ప్రకారం వాట్సాప్‌, జూమ్, గూగుల్‌ డుయో లాంటి టాప్‌ కాలింగ్‌ అండ్‌ మెసేజింగ్‌ సంస్థలు కూడా లైసెన్సులు పొందాల్సి ఉంటుంది. అలాగే, ఓటీటీలు, ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు కూడా టెలీ కమ్యూనికేషన్స్‌ అండర్‌లోకి రానున్నాయి. కొత్త డ్రాఫ్ట్‌పై అక్టోబర్‌ 20లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్రం ప్రభుత్వం కోరింది. బిల్లులో ప్రభుత్వం టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, పెనాల్టీని మాఫీ చేసే నిబంధనను ప్రతిపాదించింది. టెలికాం లేదా ఇంటర్నెట్ ప్రొవైడర్ తన లైసెన్స్‌ను సరెండర్ చేసినట్లయితే ఫీజు రీఫండ్ కోసం మంత్రిత్వ శాఖ ఒక నిబంధనను కూడా ప్రతిపాదించింది.

కొత్త టెలికాం బిల్లు పరిశ్రమ పునర్నిర్మాణం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో మంత్రి మాట్లాడుతూ, రాబోయే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో, సామాజిక లక్ష్యాలను సమతుల్యం చేసే లక్ష్యంతో మొత్తం డిజిటల్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వం పూర్తిగా పునరుద్ధరించగలదని మంత్రి అన్నారు. వ్యక్తుల విధులు, హక్కులు, టెక్నాలజీ ఫ్రేమ్‌వర్క్ లాంటి అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త టెలికాం బిల్లు ద్వారా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

117 కోట్ల మంది చందాదారులతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థను కలిగిఉంది. 4 మిలియన్ల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తుండగా.. జిడిపిలో 8 శాతం వాటాను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..