AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ డాక్టర్‌ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!

మహారాష్ట్ర సతారా లేడీడాక్టర్‌ ఆత్మహత్య కేసులో నిందితుడు ప్రశాంత్‌ బంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు గోపాల్‌ బదానే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్‌ఐ గోపాల్‌ బదానే తనపై అత్యాచారం చేశాడని , ప్రశాంత్‌ మానసికంగా హింసించాడని చేతిపై సూసైడ్‌ లెటర్‌ రాసి లేడీ డాక్టర్‌ ఆత్మహత్యు పాల్పడ్డారు.

లేడీ డాక్టర్‌ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!
Laday Doctor Suicide Case
Balaraju Goud
|

Updated on: Oct 25, 2025 | 10:00 PM

Share

మహారాష్ట్ర సతారా లేడీడాక్టర్‌ ఆత్మహత్య కేసులో నిందితుడు ప్రశాంత్‌ బంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు గోపాల్‌ బదానే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్‌ఐ గోపాల్‌ బదానే తనపై అత్యాచారం చేశాడని , ప్రశాంత్‌ మానసికంగా హింసించాడని చేతిపై సూసైడ్‌ లెటర్‌ రాసి లేడీ డాక్టర్‌ ఆత్మహత్యు పాల్పడ్డారు.

మహారాష్ట్ర లోని సతారాలో లేడీ డాక్టర్‌ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. డాక్టర్‌ను వేధించిన కేసులో నిందితుడు ప్రశాంత్‌ బంకర్‌ను పోలీసులు పుణేలో అరెస్ట్‌ చేశారు. లేడీ డాక్టర్‌ను ప్రశాంత్‌ మానసికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆత్మహత్యకు ప్రేరేపించనట్టు ప్రశాంత్‌పై కేసు నమోదయ్యింది. సతారా కోర్టు ప్రశాంత్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. లేడీ డాక్టర్‌ను స్థానిక ఎంపీ తప్పుడు సర్టిఫికేట్ల కోసం చాలా వేధించారని శివసేన ఉద్దవ్‌ వర్గం , కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడంతో ఈ వ్యవహారం పొలిటకల్‌ టర్న్‌ తీసుకుంది.

ప్రశాంత్‌ మానసిక వేధింపులతో పాటు ఎస్‌ఐ గోపాల్‌ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చేతిపై సూసైడ్‌ నోట్‌ రాసి డాక్డర్‌ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. గురువారం (అక్టోబర్ 23) రాత్రి ఆమె ఫల్టాన్‌లోని ఓ హోటల్‌ గదిలో ఉరికి వేలాడుతూ కన్పించారు. సతారా పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత ఐదు నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్‌లో పేర్కొన్నారు. ఎస్సై గోపాల్‌ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తన ఇంటి యాజమాని కుమారుడు ప్రశాంత్‌ బంకర్‌ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎస్‌ఐ గోపాల్‌బదానేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. పరారీలో ఉన్న గోపాల్‌ బదానే కోసం ప్రత్యేక పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి.

లేడీ డాక్టర్‌ ఆత్మహత్యకేసులో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌. విపక్షాలు ఈ ఘటనపై రాజకీయం చేయడం తగదన్నారు. ఇది చాలా సీరియస్‌ వ్యవహారం. ఓ యువడాక్టర్‌ తన మానసిక వేదనను చేతిపై రాసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విపక్షాలు ఈ ఘటనపై రాజకీయం చేయడం దారుణమన్న సీఎం. యువ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంటే విపక్షాలు దానిని రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. అయితే వైద్యురాలి మృతికి కారణమైన గోపాల్‌ను అరెస్ట్‌ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?