Alcohol: ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇకపై మద్యం కొనుగోలు చేయాలంటే అది చూపించాల్సిందే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 04, 2021 | 7:21 AM

Alcohol: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో మద్యం అంత ఈజీగా దొరకబోదు. ఇకపై మద్యం కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా కరోనా వ్యాక్సీన్ వేసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.

Alcohol: ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఇకపై మద్యం కొనుగోలు చేయాలంటే అది చూపించాల్సిందే..
Third Vaccine

Alcohol: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో మద్యం అంత ఈజీగా దొరకబోదు. ఇకపై మద్యం కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా కరోనా వ్యాక్సీన్ వేసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. అలాగైతేనే వారికి మద్యం అమ్ముతారు. లేదంటే నిర్మొహమాటంగా బయటకు గెంటేస్తారు. ఈ మేరకు నీలగిరి జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో రోజు రోజుకు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ మేరకు వైరస్ కట్టడికై చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నీలగిరి జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం కొనుగోలు చేయడానికి మద్యం తప్పనిసరి చేశారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో మద్యం కొనాలనుకునే వారు కరోనా టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడిన కలెక్టర్.. వాస్తవానికి మద్యం సేవిస్తే వ్యాక్సీన్ తీసుకోకూడదు. అందుకే.. మద్యం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అందుకు సంబంధించిన ధృవీకరణ కూడా చూపించాలన్నారు. ఒకవేళ టీకా తీసుకోనట్లయితే.. అటువంటి వారికి టీకా విక్రయించబోరని స్పష్టం చేశారు. ‘‘మద్యం సేవించడం వల్ల తాము కరోనా టీకా వేయించుకోలేకపోతున్నామని కొందరు చెప్పారు. అయితే, ఇప్పుడు మద్యం కొనుగోలు చేయడానికి వారు టీకా రుజువును చూపించాల్సి ఉంటుంది.’’ అని నీలగిరి జిల్లా కలెక్టర్ జె ఇన్నోసెంట్ దివ్య తేల్చి చెప్పారు.

ఇదిలాఉంటే.. తమిళనాడు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన టీకా వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైగా టీకాలు వేశారు. కరోనా థర్డ్ వేవ్‌ను అరికట్టేందుకు గానూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గానూ.. అనే రాష్ట్రాల్లో జిల్లా పరిపాలనా యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు. స్వంత ఆలోచనలతో టీకా ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వాలు సైతం ఆదేశిస్తున్నాయి.

ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. ఎవరైనా వ్యక్తి ఒక సమావేశానికి హాజరు కావడం తప్పనిసరి అయితే ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ పొంది ఉండాలి అని పేర్కొన్నారు. టీకా తీసుకున్న తరువాత కూడా మాస్క్ ధరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సీన్ తీసుకోవడం ద్వారా అనేక రూపాల్లో వచ్చే కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చునని, ప్రాణాపాయం తప్పిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే ఈ వారం ప్రారంభంలో, కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో టీకాలు వేసిన వ్యక్తులకు మాత్రమే పింఛన్లు విడుదల చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఔట్‌లెట్‌ల నుండి రేషన్ పొందడానికి టీకాలు వేయడాన్ని కూడా ఇది తప్పనిసరి చేసింది. చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎంఆర్ రవి మాట్లాడుతూ.. ‘‘టీకాలు వద్దంటే రేషన్ వద్దు’’ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ‘‘రేషన్ సదుపాయాన్ని పొందడానికి, బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులు దాదాపు 2.9 లక్షల మంది, తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని రవి చెప్పారు.

ఇక నీలగిరి జిల్లాలో ‘‘టీకాలు వద్దంటే పెన్షన్ కూడా లేదు’’ అనే నినాదాన్ని కూడా ఇచ్చామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ‘‘జిల్లాలో దాదాపు 2.20 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ విషయంలో అన్ని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశాము. టీకా తీసుకున్నట్లు రుజువు చూపిన వారికే పెన్షన్ అందివ్వాల్సిందిగా మార్గదర్శకాలు జారీ చేశాం. జిల్లాలో ప్రతీ ఒక్కరికి టీకా వేయించే ప్రయత్నంలో భాగాంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం.’’ అని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.

Also read:

Traffic Police: అడ్డంగా బుక్కైన ట్రాఫిక్ పోలీసు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వైరల్ వీడియో..

Covid 10-Kids: పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు.. మీ ఇంట్లో పిల్లలుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

Hyderabad: పిస్టల్‌తో బెదిరింపులు.. ఒంటరిగా వచ్చేవారే టార్గెట్.. ఇది ఫ్రాంక్ కాదండోయో.. అచ్చు సినిమాలోలానే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu