Traffic Police: అడ్డంగా బుక్కైన ట్రాఫిక్ పోలీసు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వైరల్ వీడియో..
Traffic Police: తమిళనాడులోని తిరుమంగళంలో ఓ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Traffic Police: తమిళనాడులోని తిరుమంగళంలో ఓ ట్రాఫిక్ పోలీసు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమంగళంలోని వీఆర్ మాల్ సమీపంలో ఓ ట్రాఫిక్ పోలీసు వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ డీసీఎంను ఆపాడు. ఆ డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తో చర్చించాడు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ఎంత బ్రతిమాలినా అస్సలు తగ్గడం లేదు ఆ పోలీసు అధికారి. అయితే, ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వగా గుట్టుచప్పుడు కాకుండా చేతితో తీసుకుని.. జేబులో పెట్టుకున్నాడు. అయితే, ఈ ఘటనకు సమీపంలోనే ఉన్న కొందరు పాదాచారులు దీనిని గమనించి వీడియో తీయడం ప్రారంభించారు. అలా ఫోన్ కెమెరాలలో బంధించిన ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. ఇంకేముంది.. గంటల వ్యవధిలోనే ఆ వీడియో రచ్చ రచ్చ చేసింది. మరికొందరు ఈ వీడియోను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లంచం తీసుకున్న పోలీసులు.. తిరుమంగళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఇదే అంశంపై సీనియర్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. వీడియో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి విచారణ ప్రారంభించామని చెప్పారు.
ఇదిలాఉంటే.. సదరు ట్రాఫిక్ పోలీసు భారీ వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అలా పట్టుకున్న వాహనదారులతో బేరసారాలు ఆడి అందినకాడికి నొక్కేస్తున్నాడని జనాలు చెబుతున్నారు. కాగా, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది లంచాలు స్వీకరించకుండా అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్ చెన్నై పోలీసులు ఇ-చలాన్, పిఒఎస్ యంత్రాలు, బ్యాంక్ ఖాతాల ద్వారా జరిమానా చెల్లించడం, కాంటాక్ట్‌లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సహా అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇంతకుముందు ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఒక వ్యక్తి నుండి డబ్బు స్వీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని సస్పెండ్ చేశారు.
Also read:
Covid 10-Kids: పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు.. మీ ఇంట్లో పిల్లలుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..