Virat Kohli: నయా రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఆసియన్‌గా భారత క్రికెట్ టీమ్ సారథికి అరుదైన గుర్తింపు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 04, 2021 | 7:04 AM

Virat Kohli: మోస్ట్ స్టైలీష్, ఫిట్టెస్ట్ క్రికెట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ ‌క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని

Virat Kohli: నయా రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఆసియన్‌గా భారత క్రికెట్ టీమ్ సారథికి అరుదైన గుర్తింపు..
Virat Kohli

Follow us on

Virat Kohli: మోస్ట్ స్టైలీష్, ఫిట్టెస్ట్ క్రికెట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ ‌క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని దాటిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు.. తొలి ఆసియన్‌గా కూడా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. ఫోటో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో 150 మిలియన్ల మార్కును చేరుకున్న నాలుగో క్రీడా ప్రముఖుడిగా కోహ్లీ నిలిచాడు. 337 మిలియన్ ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా, లియోనెల్ మెస్సీ, నేమార్ వరుసగా 260 మిలియన్, 160 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండవ, మూడవ స్థానంలో ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 75 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న తొలి ఆసియన్‌గా కోహ్లీ ఇంతకు ముందు నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్ కాకుండా, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కోహ్లీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు అతనికి ట్విట్టర్‌లో 43.4 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 48 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల, కోహ్లీ భారతదేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్‌లను వెనక్కి నెట్టి మరీ ముందుకు వచ్చాడు. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ 2020 డఫ్ & ఫెల్ప్స్ నివేదిక ప్రకారం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ $ 237,7 మిలియన్ ఒక బ్రాండ్ విలువతో భారతదేశంలోనే ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు. కాగా, ఈ స్టార్ కెప్టెన్.. తాను స్పాన్సర్ చేసే ప్రతీ పోస్ట్‌పై రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్‌లో టాప్‌లో ఉన్న రోనాల్డ్.. ఇన్‌స్టాగ్రమ్‌లో తాను చేసిన ప్రతీ స్పాన్సర్‌కు రూ. 11.72 కోట్లు వసూలు చేస్తారని తెలుస్తోంది.

Also read:

Kcr-Modi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 50 నిమిషాల ఈ భేటీలో దేని గురించి చర్చించారంటే..

IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్..

Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి ఆందోళన.. ఎందుకో తెలుసా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu