Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి ఆందోళన.. ఎందుకో తెలుసా..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 03, 2021 | 10:34 PM

ఆ గ్రామస్థులకు కోపమొచ్చింది.. కోపాన్ని నిరసనగా మార్చారు.. అయితే తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ ప్లాన్ చేశారు. అనుకన్నట్లుగానే వారు స్కెచ్ ఫలిచింది.

Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి  ఆందోళన.. ఎందుకో తెలుసా..

Follow us on

ఆ గ్రామస్థులకు కోపమొచ్చింది.. కోపాన్ని నిరసనగా మార్చారు.. అయితే తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ ప్లాన్ చేశారు. అనుకన్నట్లుగానే వారు స్కెచ్ ఫలిచింది. ఇది ఎక్కడో కాదు ఏపీ రాజధాని గ్రామం మంగళగిరిలో… – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం గ్రామం ఇందుకు వేదికగా మార్చింది. వెంటనే ప్లాన్ ప్రకారం ఎర్రబాలెం గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో గాడిదను కట్టేశారు. పంచాయతీ కార్యాలయంలో గాడిదను ఎందుకు కట్టేశారు అన్న చర్చ అసలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

గుంటూరు జిల్లాలో ఓ గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో గత కొంత కాలంగా రోడ్లపై గాడిదలు పెరిగిపోయాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రధానంగా రాత్రి సమయాలలో వాహనదారులు గాడిదలను ఢీ కొట్టడం జరుగుతోంది. వీధిలైట్లు సరిగ్గా వెళ్లకపోవడంతో రోడ్లపై పడుకున్న గాడిదలను గుర్తించలేకపోతున్నామని గ్రామస్థులు ఫిర్యాదు చేసిన పట్టించుకునేవారు లేరని వారు ఆరోపిస్తున్నారు.

ఇక ఏడెనిమిది నెలల క్రితం ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఓ గాడిద రోడ్డుపైకి రావడంతో కంట్రోల్ చేసుకోలేకపోయిన వాహనదారుడు దాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సదరు వాహనదారులు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత పంచాయతీ అధికారులకు గ్రామస్తులు అనేకమార్లు ఫిర్యాదులు చేశారు. రోడ్లపై గాడిదలు సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.

గ్రామంలో గాడిదల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు గాడిదను పంచాయతీ కార్యాలయంలో కట్టేసి తమ నిరసనను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి: Taliban Panjshir: 450 మంది తాలిబన్లు హతం.. మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu