IND vs ENG 4th Test: ఇంగ్లండ్ గడ్డపై రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్.. ఈ ఘనత సాధించిన ఎనిమిదో టీమిండియా క్రికెటర్‌గా..
Rohit Sharma 15000 Runs: లండన్‌లోని ఓవల్ క్రికెట్ స్టేడియం వేదిగా భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన..
Rohit Sharma 15000 Runs: లండన్‌లోని ఓవల్ క్రికెట్ స్టేడియం వేదిగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన పేరిట సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగులు పూర్తి చేశాడు. ఇవాళ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ.. 18 పరుగులు చేసి 15,000 పరుగుల మైలురాయిని దాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మార్క్ దాటిన ఇండియన్ క్రికెటర్లలో రోహిత్ 8వ స్థానంలో నిలిచాడు. 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్ వివరాలు.. 1. సచిన్ టెండూల్కర్ 2. రాహుల్ ద్రవిడ్ 3. విరాట్ కోహ్లీ 4. సౌరవ్ గంగూలీ 5. ఎంఎస్ ధోనీ 6. వీరేంద్ర సెహ్వాగ్ 7. మొహమ్మద్ అజారుద్దీన్ 8. రోహిత్ శర్మ(కొత్త రికార్డ్)
కాగా, రోహిత్ శర్మ చేసిన 15,000 పరుగుల్లో 40 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలో అసాధారణమైన రన్‌రేట్ ను కలిగి ఉన్నాడు. వన్డేల్లో 9,205 పరుగులు చేయగా.. టీ20 మ్యాచ్‌ల్లో 2,864, టెస్ట్ మ్యాచ్‌ల్లో 2900 లకు పైగా పరుగులు చేశాడు. రోహిత్ తదుపరి టార్గెట్ అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ. వీరందరినీ క్రాస్ చేసి టాప్ 4లో నిలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. అత్యంత వేగంగా(తక్కువ ఇన్నింగ్స్‌లోనే) 15వేల పరుగులు పూర్తి చేసిన ఇండియన్ క్రికెటర్లలో రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు. 333 ఇన్నింగ్స్‌లలో 15 వేల పరుగులు పూర్తి చేసి విరాట్ కోహ్లీ టాప్‌ప్లేస్‌లో నిలిచాడు. ఆ తరువాత స్థానంలో 356 ఇన్నింగ్స్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ ఉన్నాడు. ద్రవిడ్ 368 ఇన్నింగ్స్‌లలో 15 వేల పరుగులు పూర్తి చేయగా.. సెహ్వాల్ 371, రోహిత్ శర్మ 397, గంగూలీ 400, అజారుద్దీన్ 434, ఎంఎస్ ధోనీ 452 ఇన్నింగ్స్‌ల్లో 15 పరుగుల మైలు రాయిని దాటారు.
ఎవరెన్ని ఇన్నింగ్స్‌లంటే.. 333: విరాట్ కోహ్లీ 356: సచిన్ 368: ద్రవిడ్ 371: సెహ్వాగ్ 397: రోహిత్ శర్మ ** 400: గంగూలీ 434: అజారుద్దీన్ 452: MS ధోనీ
BCCI Tweet:
Milestone ? – @ImRo45 breaches the 15K run mark in International Cricket.#TeamIndia pic.twitter.com/st5U454GS6
— BCCI (@BCCI) September 3, 2021
Also read:
Coconut Oil Health Benefits: కొబ్బరి నూనె 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!