Coconut Oil Health Benefits: కొబ్బరి నూనె 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!

Coconut Oil Health Benefits: భారతీయులు చాలా సంవత్సరాలుగా కొబ్బరి నూనెను వాడుతున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో

Coconut Oil Health Benefits: కొబ్బరి నూనె 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!
Coconut Oil
Follow us
uppula Raju

|

Updated on: Sep 03, 2021 | 10:15 PM

Coconut Oil Health Benefits: భారతీయులు చాలా సంవత్సరాలుగా కొబ్బరి నూనెను వాడుతున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సనాతన ఆయుర్వేదంలో కొబ్బరి నూనె పాత్ర చాలా కీలకం. ఔషధాల తయారీలో కూడా దీనిని వాడేవారు. వర్జిన్ కొబ్బరి నూనె మంచి రుచి, వాసన కలిగి ఉంటుంది. మీ రోజువారీ డైట్‌లో ఖచ్చితంగా కొబ్బరిని చేర్చుకోవాలి. దీని 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు (MCFA లు) లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. మోనోలారిన్ యాంటీ-వైరస్‌గా పనిచేస్తుంది.

2. బరువును నియంత్రిస్తుంది ప్రతిరోజు పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. కడుపు నిండిన భావం కలిగిస్తుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్‌ అదుపులో ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గుతుంది.

3. శక్తిని పెంచుతుంది కొబ్బరి నూనె కొవ్వు ఆమ్లాల ఉత్తమ కలయిక. ఇవి జీవక్రియపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి. చెడు బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి.

4. జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది కొబ్బరి నూనె జుట్టుకు చాలా మంచిది. భారతీయులు చాలా కాలం నుంచి దీనిని వాడుతున్నారు. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్త సరఫరా అందుతుంది. ఇది సహజమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

5. చర్మాన్ని తేమగా చేస్తుంది కొబ్బరి నూనెను అనేక సౌందర్య ఉత్పత్తులలో వాడుతారు. వర్జిన్ కొబ్బరి నూనెలో మంచి సువాసన ఉంటుంది. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం, శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది సహజంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

Vegetables: ఈ 4 కూరగాయలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి..! తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి..

Monsoon Health Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

Weight Loss Tips: పొటాషియం అధికంగా ఉండే ఆహారం తింటే సులువుగా బరువు తగ్గవచ్చు.. అవేంటంటే..?