Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetables: ఈ 4 కూరగాయలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి..! తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి..

Vegetables: ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది. వీటి నుంచి శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే ఊబకాయం,

Vegetables: ఈ 4 కూరగాయలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి..! తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి..
Vegetables
Follow us
uppula Raju

|

Updated on: Sep 02, 2021 | 8:33 PM

Vegetables: ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది. వీటి నుంచి శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్, అధిక బీపీ వంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. పచ్చి కూరగాయలు ఎక్కువగా తినకపోయినా వీటిని మీ ఆహారంలో ఏదో ఒక విధంగా చేర్చితే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన అలాంటి 4 కూరగాయల గురించి తెలుసుకుందాం.

1. పాలకూర: పాలకూరలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్స్ కేటగిరీలో సూచిస్తారు. ఇందులో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలేట్ వంటి అంశాలు ఉంటాయి. అలాగే ఇది విటమిన్ ఎకి మంచి మూలం. పాలకూర శరీరాన్ని నియంత్రిస్తుంది. కీళ్ల మధ్య ద్రవపదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. కణాలకు పోషకాలను అందిస్తుంది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. శరీరంలో రక్తం కొరతను తీర్చుతుంది. ఈ కారణంగా రక్తహీనత తగ్గుతుంది. కంటి చూపు, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటాయి.

2. క్యారట్: క్యారెట్‌లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఐరన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఎ, డి, సి, బి 6 మొదలైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో అతితక్కువ కొవ్వు ఉంటుంది. దీని రెగ్యులర్‌గా వాడితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు బాగవుతుంది. బిపిని నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చర్మం మెరిసిపోతుంది శరీరంలో రక్తం కొరత తగ్గుతుంది.

3. బ్రోకలీ: క్యాబేజీలా కనిపించే ఆకుపచ్చ బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో ప్రోటీన్, కాల్షియం, క్వెర్సెటిన్, కార్బోహైడ్రేట్, ఐరన్, విటమిన్ ఎ, సి మొదలైన పోషకాలు ఉంటాయి. రోజూ బ్రోకలీని తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది.

4. వెల్లుల్లి: వెల్లుల్లిని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిని ఔషధాలలో వినియోగిస్తారు. వెల్లుల్లిలో కాల్షియం, ఇనుము, రాగి, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. జలుబు, ఆస్తమా వంటి వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది హృదయ సంబంధ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటే చాలా మంచిది.

Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రేపే ఈడీ ముందకు రకుల్ ప్రీత్

Avocado Benefits: అందం కోసం అవకాడో..! ఈ 5 ముఖ సమస్యలకు చక్కటి పరిష్కారం..

YSR ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన ప్రముఖులు వీరే.. వెళ్తే తప్పేంటన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌..