Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రేపే ఈడీ ముందకు రకుల్ ప్రీత్

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 02, 2021 | 8:11 PM

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు సంబంధించి తాజాగా ఓ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్....

Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రేపే ఈడీ ముందకు రకుల్ ప్రీత్
Rakul Preet

Follow us on

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు సంబంధించి తాజాగా ఓ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ విచారణకు హాజరుకానున్నారు. నిజానికి ఆమె ఈనెల 6వ తేదీన విచారణకు వెళ్లాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆ రోజు తాను రాలేనంటూ రకుల్‌ రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే.. డేట్ మార్చేందుకు తొలుత అధికారులు ఒప్పుకోలేదు. దీంతో ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ  అధికారులకు మరో రిక్వెస్ట్ సెండ్ చేశారు రకుల్. ఇందుకు సమ్మతించిన ఈడీ.. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఎంక్వైరీకి రమ్మంటూ రిప్లై ఇచ్చింది.  ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో రేపు రకుల్‌కు ప్రశ్నలు సంధించనున్నారు ఈడీ అధికారులు.

డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్ సింగ్‌ విచారణ కీలకంగా చెప్తున్నారు. ఎందుకంటే.. గతేడాది ఆమె ముంబైలోను విచారణ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. డ్రగ్స్‌ వాడకంపై ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఫోకస్ చేసింది. ఆ సమయంలో.. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన ముంబై NCB ముందు విచారణకు హాజరయ్యారు రకుల్ ప్రీత్‌ సింగ్.

ముగిసిన చార్మి విచారణ

షెడ్యూల్‌ ప్రకారం బహీర్‌బాద్‌లోని ఈడీ ఎంక్వయరీ ఆఫీసుకు ఎంక్వైరీ నిమిత్తం వచ్చారు వచ్చారు నటి చార్మి. ఈడీ నోటీసుల ప్రకారం చార్మి తన బ్యాంక్‌ అకౌంట్స్‌ డిటేల్స్‌తో వచ్చారు. ఆమె వెంట చార్డెట్‌ అకౌంట్‌ సతీష్‌ కూడా ఎంక్వయిరీ ఆఫీసులోనికి వెళ్లారు. 2013 నుంచి 2018 వరకు తన బ్యాంక్‌ అకౌంట్ల లావాదేవీలను ఈడీ అధికారులకు ఇచ్చానన్నారు చార్మి.  డ్రగ్‌ లింక్స్‌.. మనీ లాండరింగ్‌, ఫెమా ఉల్లంఘన వంటి అంశాలపై కూడా ఫోకస్‌ చేసిన ఈడీ. చార్మిని 8 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. . కెల్విన్‌తో పరిచయం ఎప్పటి నుంచి? ఎలా? సినిమాల వరకే పరిమితమా? డ్రగ్‌ లింక్స్‌ వున్నాయా? మనీ బట్వాడా వెనుక అసలు మంత్ర ఏంటి? ఇలా అన్ని కోణాల్లో చార్మిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

పూరీ ఇచ్చిన డిటేల్స్‌పై కూడా చార్మిని కొశ్చన్‌ చేసినట్టు సమాచారం. పూరీ-చార్మీ పార్టనర్‌ షిప్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇద్దరూ డ్రగ్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైడ్‌ యాంగిల్‌లో డ్రగ్‌ లింక్‌లపై ఆరా తీస్తోంది ఈడీ. తొలి దఫా 12మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులుజారీ చేసింది. ఎంక్వయరీలో పూరీ ఏం చెప్పారు? చార్మి వెర్షన్‌ ఏంటీ? ప్రశ్నల్లాగే జవాబులు కూడా సేమే వచ్చాయా? ఇద్దరి ఆన్సర్లలో కొత్త లింక్‌ ఏదైనా తళుక్కుమందా?ఈ నెల 6న సీన్‌లోకి రావాల్పిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వస్తారా? లేదా? ఇప్పటి వరకు ఈడీ విచారణలో తేలిన కీలక అంశాలేంటి? అనేది చర్చగా మారిందిప్పుడు.

Also Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం.. కీలక ఆదేశాలు

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu