Andhra Pradesh: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం.. కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం మరికొంతకాలం పొడిగించింది. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష సందర్భంగా సీఎం జగన్....

Andhra Pradesh: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. వినాయక చవితి వేడుకలు ఇళ్లకే పరిమితం.. కీలక ఆదేశాలు
Ap curfew
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2021 | 7:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం మరికొంతకాలం పొడిగించింది. కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కాగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగా స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్లు చెప్పారు. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో 3 శాతానికి లోపలే పాజిటివిటీ రేటు ఉందన్నారు. దాదాపు 10వేల గ్రామ సచివాలయాల పరిధిలో కేసులు లేవని వెల్లడించారు. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాలుగా సిద్ధమయ్యామని అధికారులు సీఎంకు చెప్పారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్‌ సన్‌ట్రేటర్లు సిద్ధం చేశామని.. మరో 2493 కూడా సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. 27, 311 ఆక్సీజన్‌ డి–టైప్‌ సిలెండర్లు సిద్దం చేశామన్నారు.  సెప్టెంబరు నెలాఖరు నాటికి 95 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికి 50 ఆస్పత్రుల్లో పూర్తి అయినట్లు వివరించారు. మొత్తం 143 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు అయ్యాయని చెప్పారు.

నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వచ్చే ఫిబ్రవరి చివరినాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలంటూ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్నదానిపై ఒక ఆలోచన కూడా చేయాలని సీఎం ఆదేశించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ఏ రకంగా అడుగులు ముందుకేయాలన్న దానిపై సరైన ఆలోచనలు చేయాలన్నారు సీఎం.

Also Read: ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌.. వారం రోజులు సెలవులు ప్రకటించిన MEO

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్