Telangana: ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌.. వారం రోజులు సెలవులు ప్రకటించిన MEO

తెలంగాణలో పాఠశాలలు తెరిచి 2 రోజులు కాలేదు.. అప్పుడే కరోనా కలవరం మొదలైంది. ఇప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా..? వద్దా అని....

Telangana: ఆ స్కూల్లో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌.. వారం రోజులు సెలవులు ప్రకటించిన MEO
Telangana Schools

తెలంగాణలో పాఠశాలలు తెరిచి 2 రోజులు కాలేదు.. అప్పుడే కరోనా కలవరం మొదలైంది. ఇప్పుడే పిల్లల్ని స్కూల్‌కి పంపించాలా..? వద్దా అని పేరెంట్స్ మదనపడుతోన్న సమయంలో.. విద్యాలయాల్లో నమోదవుతున్న కేసులు గుబులు రేపుతున్నాయి. తాజాగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పాఠశాలను శానిటైజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్‌ఈఓ(MEO) పాఠశాలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు.

పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

పాఠశాలల్లో ఎక్కువ మంది ఒకేసారి వైరస్  బారిన పడితే ఆ పాఠశాలని క్లష్టర్‌గా గుర్తించి పిల్లలకు, టీచర్స్ కి వెంటనే టెస్టులు చేస్తామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. టెస్టుల్లో ఐదుగురు కంటే ఎక్కువ మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే పాఠశాల స్ట్రెంత్‌ని బట్టి వారం రోజుల పాటు స్కూల్‌ని మూసివేస్తామని చెప్పారు. ఒకే క్లాస్‌లో ఎక్కువ కేసులు నమోదైతే.. ఆ క్లాస్‌లోని స్టూడెంట్స్ అందరినీ ఐసోలేషన్‌కి పంపుతామని వెల్లడించారు. 95% పాఠశాలల స్టాఫ్‌కి వాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మాత్రమే టీచర్లను, స్టాఫ్‌ని పాఠశాలల్లోని అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. కరోనా వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపారు. పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. పిల్లల మానసిక స్థితి దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు తెరిచామన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను స్కూల్‌కు పంపాలని కోరారు. అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ చేశామని, థర్మల్ స్క్రీనింగ్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మంది కరోనా బారిన పడ్డారని.. 20 ఏళ్లల్లోపు వారిలో 13 శాతం మందికి కొవిడ్ సోకిందని తెలిపారు. పిల్లలకు కరోనా సోకినా 100 శాతం కోలుకుంటున్నారని డీహెచ్‌ శ్రీనివాస రావు చెప్పారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడయిందని తెలిపారు.

Also Read: ఏపీలో కొత్తగా 1,378 కరోనా వ్యాప్తి.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

Click on your DTH Provider to Add TV9 Telugu