AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,378 కరోనా వ్యాప్తి.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 02, 2021 | 5:35 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 59,566 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1378 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,378 కరోనా వ్యాప్తి.. ఆ 2 జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి
Ap Corona

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 59,566 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1378 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2016680కి చేరింది. కొత్తగా 10 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13877 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,139 మంది వైరస్ కారణంగా కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1988101కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14702 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,67,45,035 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొ క్క రు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 242 కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 219 కొత్త కేసులు వెలుగుచూశాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలను దిగువన పట్టికలో చూడండి 

కరోనా సమాచారం మీ చేతుల్లోనే:

● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ●వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app.  ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also Read: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం.. ఆపై

బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu