Tenali: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

గుంటూరు జిల్లా తెనాలి నియోజవర్గం కొల్లూరు గ్రామానికి చెందిన నంబూరి మధుసూధన రావు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు 26న నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి బంధువులను పిలిచాడు.

Tenali: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్
Theft
Follow us

|

Updated on: Sep 02, 2021 | 4:11 PM

ఆ వ్యాపారి తన అభిరుచికి అనుగుణంగా కొత్త ఇల్లు కట్టుకున్నాడు. నూతన గృహ ప్రవేశానికి బంధువులను, స్నేహితులను పిలిచాడు. అందరి శుభాకాంక్షల మధ్య సాంప్రదాయబద్దంగా కొత్త ఇంట్లోకి కుటుంబంతో అడుగుపెట్టాడు. రోజంతా ఆనందోత్సాహాల్లో గడిపిన చుట్టాలు, ఇంట్లోవాళ్లు అలసిపోయి నిద్రపోయారు. పడుకునే ముందు బంగారం నగలన్నీ బ్యాగులో పెట్టారు. ఆ బ్యాగును తలకింద ఉంచుకుని నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి ఇంట్లో దొంగలుపడి.. మొత్తం దోచుకెళ్లారు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి బంగారం కనిపించకపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆగస్టు 26న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లూరులో జరిగింది. నంబూరి మధుసూధనరావు అనే వ్యాపారి నూతన గృహ ప్రవేశంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హనుమాన్ పాలెం గ్రామం వద్ద మర్రి వెంకయ్య(అలియాస్ వెంకటేశ్వర్లు) అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించడగా దొంగతనానికి పాల్పడింది తానేనని వెంకయ్య అంగీకరించాడు. అతని నుంచి రూ.7,35,000 విలువ చేసే 32కాసుల బంగారు అభరణాల్ని పోలీసులు రికవరీ చేశారు. నిందితునిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  నిందితుడు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడని..ఎస్పీ మూర్తి వెల్లడించారు. మద్యానికి బానిసై ఖర్చులకు డబ్బులు లేనప్పుడు చుట్టు ప్రక్కల గ్రామలలో దొంగతనాలు చేస్తూ ఉంటాడని తెలిపారు.

కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన కొల్లూరు ఎస్సై ఉజ్వల్, సిబ్బందిని, తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్​ని ఎస్పీ అభినందించి, నగదు ప్రోత్సాహకాలను అందించారు.

Also Read: ఛా.. ఛా.. ఇతడేం పోలీస్.. పరువు తీశాడు.. సేఫ్టీ కోసం స్టేషన్‌ లాకర్‌ పెట్టిన సొమ్ముతో

ఆ బిజినెస్​మెన్‌ల​ భార్యలే అతడి టార్గెట్.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేశాడు.. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను సైతం