Cheating: ఆ బిజినెస్​మెన్‌ల​ భార్యలే అతడి టార్గెట్.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేశాడు.. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను సైతం

బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా బిల్డప్ ఇస్తాడు. తనతో కాని పని ఉండదంటూ కలరింగ్ ఇస్తాడు. సమస్యల్లో చిక్కుకున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులే....

Cheating: ఆ బిజినెస్​మెన్‌ల​ భార్యలే అతడి టార్గెట్.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేశాడు.. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను సైతం
Conman Sukesh Chandrasekhar
Ram Naramaneni

|

Sep 01, 2021 | 7:42 PM

బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా బిల్డప్ ఇస్తాడు. తనతో కాని పని ఉండదంటూ కలరింగ్ ఇస్తాడు. సమస్యల్లో చిక్కుకున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులే టార్గెట్ చేసి.. వారి వద్దను భారీగా డబ్బు గుంజుతాడు. ఈ క్రమంలో అతడి నేరాలు బయటపడటంతో.. పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు పంపారు. అయినా కూడా అక్కడి నుంచీ తన బాగోతాన్ని నడిపించాడు. అతనే.. చెన్నైకి చెందిన సుకేశ్​ చంద్రశేఖర్​. కొన్ని సంవత్సరాలుగా.. పలువురు పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తలే లక్ష్యంగా అతడు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు.

రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్​ సింగ్​, శివిందర్​ సింగ్​లకు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు కాజేశాడు సుకేశ్​ చంద్రశేఖర్​. శివిందర్​ సింగ్​ భార్య అదితి సింగ్​ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసింది ఢిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి తీసుకున్న రూ.200 కోట్లతో చెన్నైలో ఓ కాస్ట్లీ బంగ్లా కొన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ఇంటిని లగ్జరీ ఫర్నీచర్​తో అలంకరించినట్లు సమాచారం. అలాగే.. మెర్సిడేస్​ బెంజ్​ 300 ఎస్​ఎల్​ఆర్​ వంటి 16 ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. ఈడీ​ ఇటీవల దాడులు జరిపి.. బంగ్లాతో పాటు రూ.20 కోట్ల విలువైన వస్తువులను సీజ్​ చేసింది.

బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను ఛీట్ చేశాడు

రూ.200 కోట్ల దోపిడి కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను ఈడీ ఇటీవల ప్రశ్నించింది. ఈ విచారణలో జాక్వెలిన్​ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్​ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు గుర్తించాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు వివరించారు. వాటి ద్వారా జాక్వెలిన్​ను మోసగించిన వివరాలను రాబట్టనున్నట్లు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​లపై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

Also Read: “ఏ నెల పింఛను ఆ నెలలోనే..!” ఏపీలో పెన్షన్ వివాదంపై స్పందించిన సజ్జల.. ఫుల్ క్లారిటీ

శ్రీవారి భక్తులకు అందుబాటులోకి మరో ప్రసాదం.. సరికొత్తగా ‘ధన ప్రసాదం’

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu