Chicken Curry: చికెన్ కూర​ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త !

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 01, 2021 | 9:44 PM

దారుణం, ఘోరం..  ఇంకా ఏమనాలి ఈ ఘటనను.  చికెన్ వండేందుకు నో చెప్పిందన్న సిల్లీ రీజన్‌తో భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్​లోని షాదోల్​ జిల్లా....

Chicken Curry: చికెన్ కూర​ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త !
Chicken Curry

Follow us on

దారుణం, ఘోరం..  ఇంకా ఏమనాలి ఈ ఘటనను.  చికెన్ వండేందుకు నో చెప్పిందన్న సిల్లీ రీజన్‌తో భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్​లోని షాదోల్​ జిల్లా సెమారియతోల గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది.  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 23న నిందితుడు కమలేశ్​ కోల్​.. భార్య రామ్​బాయ్​ కోల్​ను చికెన్​ వండమని కోరాడు. అయితే అందుకు ఆమె నో చెప్పింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నిందితుడు కమలేశ్.. అక్కడే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా మోదాడు. దీంతో ఆమె స్పాట్‌లోనే మృతి చెందింది. ప్రమాదానికి గురై రామ్​బాయ్​ కోల్​ మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ పోస్టుమార్టం చేయగా రిపోర్టులో అసలు విషయం వెలుగుచూసింది. దీంత నిందితుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదివారం అరెస్టు చేశారు. చికెన్​ వండేందుకు నిరాకరించడం వల్లే భార్యపై దాడి చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

పానీపూరీ తీసుకువచ్చిన భర్త.. ఆగ్రహంతో ఆత్మహత్య చేసుకున్న భార్య..

పానీ పూరి.. ఓ మహిళ ప్రాణాలు తీసేసింది. భర్త తనను అడగకుండా పానీపూరీ తీసుకువచ్చినందుకు ఆగ్రహించిన భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. షోలాపూర్‌కు చెందిన గహినీనాథ్ సర్వదేకి, ప్రతీక్ష అనే మహిళకు 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాయి. గహినీనాథ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, వివాహం జరిగినప్పటి నుంచి గహినీనాథ్, ప్రతీక్ష మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకునేవి. అయితే, ఈ దంపతులు కొన్నాళ్ల క్రితం పూణెకి వచ్చి స్థిరపడ్డారు. అంబేగావ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో గహినీనాథ్ రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లాడు. అలా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా.. భార్యా, పిల్లల కోసం పానీ పూరిని పార్సల్ తీసుకువచ్చాడు. అయితే, తనకు చెప్పకుండా పానీపూరి తేవడంపై ప్రతీక్ష ఆగ్రహం వ్యక్తం చేసింది. పానీ పూరీ ఎందుకు తీసుకువచ్చావంటూ గహినీనాథ్‌తో ఘర్షణకు దిగింది. పానీపూరి తినడానికి ప్రతీక్ష నిరాకరించింది. ఆ రోజు అలా గడిచిపోగా. మరుసటి రోజు గహినినాథ్ ఆఫీస్‌కు వెళ్తుండగా.. టిఫిన్ బాక్స్ ఇవ్వలేదు ప్రతీక్ష. ఇంకా ఆగ్రహంతో రగిలిపోతోన్న ప్రతీక్ష.. అతను డ్యూటీకి వెళ్లగానే విషం తాగింది. అది గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతీక్ష ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై భారతి విద్యాపీఠ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త గహినీనాథ్ సర్వదేను అరెస్ట్ చేశారు.

Also Read: పుస్తెలమ్మయినా సరే తిందామంటే.. పులస దొరకనంటుంది.. తీరాల్లో కనిపించని సందడి

 ఏపీ పాఠశాల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్… సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu