Pulasa: పుస్తెలమ్మయినా సరే తిందామంటే.. పులస దొరకనంటుంది.. తీరాల్లో కనిపించని సందడి

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 01, 2021 | 9:29 PM

పులస..గలగల పారే గోదావరిలో మిల మిల మిరిసే మెరుపు తీగ. నిగనిగలాడే పులసను పడితే జాలర్లకు పండగే. ఎందుకంటే పుస్తెలమ్మయినా సరే పులస తినాలని...

Pulasa: పుస్తెలమ్మయినా సరే తిందామంటే.. పులస దొరకనంటుంది.. తీరాల్లో కనిపించని సందడి
Pulasa

Follow us on

పులస..గలగల పారే గోదావరిలో మిల మిల మిరిసే మెరుపు తీగ. నిగనిగలాడే పులసను పడితే జాలర్లకు పండగే. ఎందుకంటే పుస్తెలమ్మయినా సరే పులస తినాలని జనం క్యూ కడుతారు. ఖరీదు ఎంతైతేనేం పులసెట్టి పులస కూర తినాల్సిందే. టేస్ట్‌ ఆ రేంజ్‌లో వుంటది. చూస్తూనే నోరూరిపోద్ది.  గోదావరి వంటకాలు వరల్డ్ ఫేమస్‌ అనడం ఎంత నిజమో. కొసిరి కొసిరి వడ్డించే గోదావరి జిల్లా వాసుల ఆత్మీయతకు ఫిదా కాని వారుండరనేది కూడా అంతే నిజం. గోదావరి గట్టున పొయ్యి పెట్టి పులస పులుసు తినాలంటే రాసిపెట్టి వుండాలంటారు. ప్రతీ యేటా ఇక్కడ ఇలా జాతరే. కానీ ఈసారి గోదారోళ్ల ఆత్మీయతకు చిక్కు వచ్చి పడింది.  నిజానికి ఈ టయానికి గోదావరి తీరం అతిథులతో.. పులస విక్రయాలతో..వంటలతో జాతరలా జిబజిబలాడాల్సింది. కానీ సీను తారుమారైంది. సందడికి టైమోచ్చింది.. వరదొచ్చింది కానీ పులుస జాడ ఇంకా లేదు. లేదంటే లేదని కాదు. రాత్రి పగలు వలేస్తూ ఒళ్లంతా కళ్లుగా చేసుకుని ఎదురుచూస్తే.. ఒకటో రెండు పులసలు చిక్కుతున్నాయి. కానీ ఏం లాభం. కమ్‌ సే కమే కేజీ కేజన్నీరగా వుండాల్సిన పులస..పావు కేజీ సైజుమించి వుండడంలేదు.

పోలవరం ఏపీకి వరమే కానీ.. నీళ్లు వదలకపోవడం తమకు శాపంగా మారిందని వాపోతున్నారు మత్స్యకారులు. కేజీ బేసిన్‌లో చమురు అన్వేషణ కూడా తమ పొట్ట కొడుతుందంటున్నారు. ఎవర్ని కదిలించిన కన్నీటి కథలు వల దూకుతున్నాయి.  మిలమిల మెరిసే పులస..దునియాలో ఏక్‌ పీస్‌. ప్రతీయేటా జూన్‌, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల్లో మాత్రమే గోదావరిలో పులసల గలగల వుంటది. అన్ని చేపలు నీటి వాటానికి తగ్గట్టుగా పోతుంటాయి. కానీ పులస రూటే సపరేటు. ప్రవాహానికి ఎదురీదడం పులస స్పెషాల్టీ. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. నిజానికి సముద్రంలో వున్నప్పుడు వీటిని ఇలస అంటారు. గోదారి నీళ్లు తాగాక.. వెండి పసిడి కలగలిసిన రంగులోకి మారి ఇలస పులసగా మారుద్ది. ఆ పులస చిక్కితే లైఫ్‌ టర్నింగే. ఆ ఆశతోనే రేయింబళ్లు వలలేసుకొని గోదారికి ఎదురీదుతున్నారు జాలర్లు. కానీ ఈసారి మొదటికే మోసం వచ్చిందని వాపోతున్నారు జాలర్లు. పై నుంచి నీరువదలకపోవడం..చమరు అన్వేషణ.. ఇసుక మేటల మూలంగా పులస జాడలేదనేది జాలర్ల ఆవేదన.

ఇప్పుడు అసలైన పులస నెలకు అరటన్నుకు మించి దొరకటం లేదు. మిగిలిందంతా ఒడిశా నుంచి తెచ్చే ఇలసనే పులస పేరుతో అమ్మేస్తున్నారు. కానీ టేస్ట్‌ పులస మాదిరిగా లేదని పెదవి విరుస్తున్నారు పులస ప్రియులు. ఇసుక మేటలు అధికంతో పాటు, కేజీ బేసిన్లో సముద్ర కాలుష్యం వివిధ కారణాలతో పులసతోపాటు, గోదావరిలో చేపలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు 137 రకాల చేపలు ఉండేవి. వీటి సంఖ్య ఇప్పుడు 117కిపడిపోయింది. కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు వాటిళ్లందంటున్నారు ఫిషరీష్ అధికారులు..

చేప కథేం మారలేదు. సముద్రం నుంచి గోదావరికి ఎదురొచ్చే ఇలస పులసగా మారుతోంది. కానీ కాలుష్యం కాటుతో మత్స్యాకారుల బతుకు చిత్రమ్‌ ఛిద్రమవుతోంది. రాత్రింబవళ్లు గోదారిలో వేటకు వెళ్తే అరకొర పులసలే చిక్కుతున్నాయి. అవీ కూడా గ్రాముల సైజులు. చేసేదిలేక ఒడిషా ఇలసలను గోదావరి పులసగా విక్రయిద్దామనుకుంటే టేస్ట్‌ బెడిసి కొడుతోంది. గిరాకీ టైమ్‌ కదా అని లక్షల్లో అప్పులు చేసి వలలు కొన్న మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాయి. ఊరించే పులుస ఎటూ లేదు.కనీసం జాలర్లకు ఊరడింపైనా దొరికేనా. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: ఏపీ పాఠశాల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ

జనాలపై దండెత్తిన డెంగీ.. బాధితుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఆస్పత్రులు, ల్యాబరేటరీలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu