Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ పాఠశాల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్… సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ

2021-22 ఏడాదికి సిలబస్ తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3-10 తరగతులకు సిలబస్​ను తగ్గించింది. 3-9 తరగతులకు..

Andhra Pradesh: ఏపీ పాఠశాల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్... సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ
Ap Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2021 | 8:56 PM

2021-22 ఏడాదికి సిలబస్ తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3-10 తరగతులకు సిలబస్​ను తగ్గించింది. 3-9 తరగతులకు 15 శాతం, 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది.  పాఠశాల పనిదినాల అకడమిక్ కేలండర్‌ 31 వారాల నుంచి 27 వారాలకు కుదించింది. కాగా రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్​ను ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు తెలిపారు. కాగా, రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు ఆగస్ట్ 16 నుంచి పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు.

ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు

100కు 99 మార్కులు.. 100కు 98 మార్కులు.. 100కు 95 మార్కులు… ఈ పదాలను.. ప్రచారాన్ని విని చాలా సంవత్సరాలు అయింది కదా.. ఇక నుంచి ప్రతి సంవత్సరం మళ్లీ వినపడబోతున్నాయి. మార్కుల హడావుడీ.. మళ్లీ షురూ కాబోతోంది. ఏపీలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో.. 2010లో అప్పటి ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఎక్కువ మందికి ఒకే గ్రేడ్లు వచ్చినప్పుడు.. నియామకాల సమయంలో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. దీంతో అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ వ్యవస్థనే రద్దు చేసింది. తిరిగి మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది.

Also Read: “ఏ నెల పింఛను ఆ నెలలోనే..!” ఏపీలో పెన్షన్ వివాదంపై స్పందించిన సజ్జల.. ఫుల్ క్లారిటీ

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు